Pushpa 2: పుష్ప2 లో కూడా మళ్ళీ అవే తప్పులు చేసిన చిత్రబృందం..వర్క్ అవుట్ అవుతుందా?
Pushpa 2 update : 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప : ది రూల్ 2024 లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం దొరికినప్పటికీ చిత్ర బృందం మాత్రం పుష్ప పార్ట్ 1 లో చేసిన పొరపాట్లే పుష్ప 2 లో కూడా రిపీట్ చేస్తోంది అని.. కొందరు చిత్ర బృందం పై దుమ్మెత్తి పోస్తున్నారు.
Pushpa 2 The Rule Update: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు అందరూ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. పుష్ప: ది రైజ్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై.. భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప మొదటిభాగంలో లాగానే.. ఈ రెండోభాగం కూడా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని.. అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మరోవైపు చిత్రబృందం కూడా ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతోంది. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాక ప్యాన్ఇండియా రేంజ్ లో పుష్ప 1 సినిమా అందరికీ బాగా నచ్చింది. అయితే సినిమా మొదటి భాగం డేట్ల విషయంలో చిత్రబృందం ఆపట్లో చాలా ఇబ్బందులు పడింది. సినిమాని అనుకున్న తేదీకే విడుదల చేయాలని వాయిదా వేయకూడదని గట్టిగా ఫిక్స్ అయిన చిత్ర బృందం.. సినిమా నిర్మానంతర పనులను కూడా అతివేగంగా పూర్తి చేసేసింది.
టైట్ డెడ్ లైన్స్ వల్ల కనీసం సినిమాని మళ్లీ చూసుకునే సమయం కూడా చిత్ర బృందానికి ఆపుడు దొరకలేదు. అయితే 2021లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్ 2024లో రాబోతుండడంతో.. ఎలాగో మూడేళ్ల గ్యాప్ వచ్చింది కాబట్టి మొదటి భాగంలో జరిగిన తప్పులు చిత్రబృందం ఈ భాగం విషయంలో చేయరని అందరుఅనుకున్నారు.
కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే చిత్ర బృందం.. మొదటి భాగంలో చేసిన తప్పే ఇప్పుడు మళ్లీ చేయబోతున్నట్లు అనిపిస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. మే ఆఖరి దాకా సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆగస్టులోనే సినిమా విడుదల కాబట్టి చిత్త బృందం కేవలం రెండే రెండు నెలల్లో.. అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి.. ఇటు సినిమా ప్రమోషన్స్ పై కూడా దృష్టి పెట్టాల్సిఉంటుంది. మరి చిత్ర బృందం సినిమాని అనుకున్న తేదీకి విడుదల చేయగలరో లేదో చూడాలి.
ఒకవేళ అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలైనా క్వాలిటీ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైస్ లేకపోతేనే సినిమా హిట్ అవుతుందని చెప్పవచ్చు. కాబట్టి మొదటి భాగం లాగానే ఇప్పుడు సుకుమార్ రెండో భాగానికి కూడా చకచక పనులు చేయాల్సి ఉంటుంది. అంతేకాక నిజంగానే అలా చకచక చేయాలి అని సుకుమార్ ఫిక్స్ అయినట్టు వినికిడి. మరి ఈసారి కూడా సుకుమార్ సినిమా పూర్తిగా చూడకుండానే విడుదల చేసి బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి.
మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించబోతున్నారు. మొదటి భాగానికి తన అద్భుతమైన నటన తో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తారో వేచి చూడాలి.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter