Pushpa 2 Teaser Update
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప:ది రైస్ తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషలలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మొదటి భాగం విడుదలైన దగ్గర నుంచి రెండో భాగం పుష్ప: ది రూల్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే ఈ రెండో భాగం షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తూ ఉండటంతో అల్లు అర్జున్ అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ ఈ మధ్యనే ఈ చిత్రం ఆగస్టు 15న తప్పకుండా విడుదలవుతుందని సినిమా నిర్మాతలు తేల్చి చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఈ చిత్రం విడుదలకి ఇంకా కేవలం మూడు నెలలే ఉండడంతో ఈ చిత్రంపై అప్డేట్స్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ త్వరలోనే విడుదల చేయనున్నారట. 


అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ అభిమానులు పుష్ప టీజర్ అప్డేట్ గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతు సినిమా యూనిట్ ని అడుగుతున్నారు. తాజాగా పలువురు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ ని సోషల్ మీడియాలో ఇదే విషయంపై ప్రశ్నించడంతో అతను పుష్ప అప్డేట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ పుష్ప చిత్రం టీజర్ అల్లు అర్జున్ పుట్టినరోజున వస్తోంది అని.. అది తథ్యం అంటూ కామెంట్ పెట్టారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 కావడంతో అదే రోజు పుష్ప 2 టీజర్ రాబోతుందని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి అల్లు అర్జున్ తమ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


 



పుష్ప మొదటి భాగంతో నేషనల్ అవార్డు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు రాబోతున్న రెండో భాగంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో అని నేషనల్ వైడ్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ రావడం.., పాన్ ఇండియా వైడ్ స్టార్ హీరోగా ఎదగడం, మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం పెట్టడం, ఇలా అల్లు అర్జున్ కి ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఈ రెండో భాగం విడుదలయ్యాక మన బన్నీ ఎలాంటి అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారు వేచి చూడాలి


Also Read: Nita Ambani Visited Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు..


Also Read: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్‌ మీడియా అతిథులు



 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook