Pushpa 2: పుష్ప 2 నుంచి సర్ప్రైజ్ చేసిన కొత్త అప్డేట్.. అదిరిపోయిన పోస్టర్..!
Pushpa 2 surprise : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న.. సినిమా పుష్ప. ఈ చిత్రం నుంచి ఈరోజు.. అనుకోకుండా కొత్త అప్డేట్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్ చూసి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.. ఇంతకీ ఈ పోస్టర్లో ఏముందంటే..!
Pushpa 2 update : పుష్ప 2 నుంచి వచ్చిన కొత్త అప్డేట్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈరోజు అల్లు అర్జున్ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ …అనుకోకుండా ఒక పోస్టర్ విడుదల చేశారు సినిమా యూనిట్.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోంద సినిమా పుష్ప 2. ఈ చిత్రం మొదటి భాగం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 500 కోట్ల పైగా కలెక్షన్ సాధించి .. అప్పట్లో ఒక సంచలన చిత్రంగా మిగిలింది. అంతేకాదు ఈ సినిమా అల్లు అర్జున్ రేంజ్ ని ప్రపంచవ్యాప్తంగా వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది.
అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు సైతం తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది తెలుగు హీరోలు తెచ్చుకొని నేషనల్ అవార్డ్.. పుష్ప రాజ్ క్యారెక్టర్ తో అల్లు అర్జున్ సంపాదించారు అంటేనే.. ఈ క్యారెక్టర్ లో ఉన్న ఫైర్ మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక మొదటి భాగం ఎటువంటి అంచనాలు లేకుండానే అలా తీసారంటే.. సుకుమార్ రెండో భాగం ఏ లెవెల్ లో తీస్తారో అంటూ అభిమానులు భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చిన కొత్త పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది.
పుష్ప ఫస్టాఫ్ లాక్ అయిపోయిందని.. అలానే ఫుల్ ఫైర్ తో లోడ్ అయ్యిందని.. పుష్ప ఫస్ట్ అఫ్ లాక్ అండ్ లో లోడెడ్ అనే క్యాప్షన్ పెట్టి.. ఒక కష్ట పోస్టర్ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్లో అల్లు అర్జున్ వెనక్కి నిలబడుకొని కనిపించాడు. అంతకుమించి ఈ పోస్టర్లో పెద్దగా ఏమీ రివీల్ చేయకపోయినా.. చిత్ర యూనిట్ నుంచి అనుకోకుండా వచ్చిన ఈ అప్డేట్ చూసి అభిమానులు సంతోషపడుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా తప్పకుండా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకి రానుంది అని మరోసారి ఈ పోస్టర్తో కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ విషయంతో అల్లు అభిమానులు తెగ సంబరాలు జరుపుకుంటున్నారు.
Read more: Nagarjuna: మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు మరో దావా వేసిన నాగార్జున..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.