Allu Arjun Rashmika's Pushpa movie Saami saami Lyrical Song out now: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఫుల్ మాస్ హీరోగా రాబోతున్నాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌ (Pushparaj‌) అనే స్మగ్లర్‌ పాత్రలో బన్నీ (Bunny) కనిపించనున్నారు. పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక (Rashmika) నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ మాస్‌ ట్రీట్‌ బయటకు వచ్చింది. ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట దుమ్మురేపుతోంది. ఈ లిరికల్‌ వీడియోని (Saami saami Lyrical Song) గురువారం మూవీ యూనిట్ సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ఈ మాస్‌ సాంగ్‌ను మౌనికా యాదవ్‌ పాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read : T20 World Cup: తొలి ఓవర్ 1-0-2-3.. టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్


ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ‘పుష్ప’ (Pushpa) మొదటి పార్ట్ ని డిసెంబర్ 17న ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise) పేరుతో క్రిస్మస్‌ కానుకగా రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు సుకుమార్‌-అల్లు అర్జున్ (Sukumar,Allu Arjun) కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇక ఇప్పటికే పుష్ప (Pushpa) నుంచి విడుదల ఫస్ట్‌ సింగిల్‌, సెకండ్‌ సింగ్‌ల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ విశేష స్పందన వచ్చింది.



Also Read : Viral Video: ఆమె డ్యాన్స్ కు స్టైలిష్‌ స్టార్ ఫ్యాన్స్ ఫిదా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook