T20 World Cup: తొలి ఓవర్ 1-0-2-3.. టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ అంటున్న ఫ్యాన్స్

బుధవారం నమీబియా - స్కాట్లాండ్‌  మధ్య జరిగిన మ్యాచ్ లో నమీబియా బౌలర్ రూబెల్‌ ట్రంపెల్‌మన్‌ తొలి ఓవర్లో 3 వికెట్లు తీసాడు, టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ అంటున్న అభిమానాలు. 

Last Updated : Oct 28, 2021, 12:50 PM IST
  • మొదటి ఓవర్లేనే మూడు వికెట్లు తీసిన నమీబియా బౌలర్
  • టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ అంటున్న అభిమానులు
  • 1-0-2-3 తో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రూబెల్‌ ట్రంపెల్‌మన్‌
T20 World Cup: తొలి ఓవర్ 1-0-2-3.. టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ అంటున్న ఫ్యాన్స్

Craziest 1st Over in T20 World Cup History: టీ20 వరల్డ్ కప్ సమరం దుబాయ్ లో జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.. బుధవారం గ్రూప్-2 కి చెందిన నమీబియా (Namibia )- స్కాట్లాండ్‌ (Scotland) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే..! ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన నెలకొంది.

అదేంటంటే.. నమీబియా బౌలర్ రూబెల్‌ ట్రంపెల్‌మన్‌ (Ruben Trumpelmann) వేసిన తొలి ఓవర్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ట్రంపెల్‌మన్‌ వేసిన తొలి ఓవర్ ను టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ (Craziest 1st Over in T20 World Cup) గా అభిమానులు అభివర్ణిస్తున్నారు. 

Also Read: India Covid-19 Updates: భారీగా పెరిగిన కరోనా మరణాలు, పాజిటివ్ సంఖ్య.. ఎంతంటే..??

నమీబియా  - స్కాట్లాండ్‌ (Mamibia Vs Scotland) మధ్య జరిగిన మ్యాచ్ లో తొలి ఓవర్ లోనే స్కాట్లాండ్‌ మూడు వికెట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ట్రంపెల్‌మన్‌ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికి మున్సేను (George Munsey) గోల్డెన్‌డక్‌గా అవుట్ చేసాడు.. అదేవిధంగా తొలి ఓవర్ మూడో బంతికి మెక్‌ లియెడ్‌ను (Calum MacLeod) డకౌట్‌ అయ్యాడు.. అలాగే నాలుగో బంతికి బెర్రింగ్టన్‌ను గోల్డెన్‌డక్‌గా (Richie Berrington) కూడా వెనుదిరిగాడు. 

ఇలా ట్రంపెల్‌మన్‌ (1-0-2-3) తో తన కెరీర్ లోనే అత్యుత్తమ ఓవర్ ను వేయగా.. వీడియోని షేర్ చేస్తూ అభిమానులు అత్యుత్తమ క్రేజీఎస్ట్ ఓవర్ గా పేర్కొంటున్నారు. నమీబియా Vs స్కాట్లాండ్‌ మ్యాచ్ లో రూబెల్‌ ట్రంపెల్‌మన్‌ మొదటి ఓవర్ లోనే మూడు వికెట్లు తీయటంతో.. స్కాట్లాండ్‌ జట్టు 109 పరుగులకే పరిమితమైంది. అయినప్పటికీ స్కాట్లాండ్‌ స్లో పిచ్ పై నమీబియాకు ఆ తక్కువ లక్ష్యాన్ని ఛేదించటానికి కూడా గట్టి పోటీ ఇచ్చిందని తెలపాలి. 

Also Read: Viral Video: బన్నీని దించేసింది...డీజే స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News