Allu Arjun Arrest:అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై సర్వత్రా ఒక్క వర్గం ప్రజలు  ప్రశంసలు కురుస్తున్నాయి. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలేది లేదు అన్న సంకేతాలు పంపించారని రేవంత్ రెడ్డిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ ను అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి డేరింగ్ కు నిదర్శనం అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. గతంలో కూడా నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఇదే దూకుడు ప్రదర్శించారు. తప్పు చేసింది సెలబ్రెటీ ఐనా సరే ఎవరైనా వదిలేది లేదు అనే రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు అయ్యింది.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే కామెంట్స్ చేసారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోవడం విశేషం.  అవసరమైతే తాను పెట్టిన కేసును వాపసు  చేసుకుంటానని ఈ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్‌ తెలిపారు. అల్లు అర్జున్‌కు ఈ ఘటనతో అసలు సంబంధమే లేదన్నారు. బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్‌తో పాటు ఆ రోజు చాలా మంది థియేటర్‌కు వచ్చారని పేర్కొన్నారు.


మరోవైపు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం వెనక  ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులు, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మహిళ చనిపోవడానికి అల్లు అర్జున్ కారణమైనా.. అందులో పోలీసులు సెక్యురిటీ వైఫల్యం కనిపిస్తోంది. ఏది ఏమైనా పుష్ప 2 సక్సెస్ అయిన సంతోషం మాత్రం అల్లు అర్జున్ కు మిగలకుండా చేశారు.


ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..


ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.