Allu Arjun Simplicity: పాక హోటల్లో `పుష్ప రాజ్` ఫిదా అవుతున్న నెటిజన్లు (Video)
రోడ్డు పక్కన హోటల్ లో టిఫిన్ చేసి వెళ్తున్న అల్లు అర్జున్ వీడియా ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అల్లు అర్జున్ సింప్లీసిటీకి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు, ఆ వీడియో మీరే చూడండి!.
Allu Arjun Simplicity: మెగా హీరో అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) పుష్ప (Pushpa) సినిమా షూటింగ్‌లో భాగంగా కాకినాడలో (Kakinada) బిజీగా ఉన్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే.. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం రంపచోడవరం (Rampa chodavaram) సమీపంలో అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది.
దీనిలో భాగంగా సినిమా టీం తో కలిసి తూర్పు గోదావరి (East Godhavari) జిల్లా గోకవరం (Gokavaram) మీదుగా ప్రయాణిస్తున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు (Ex Cheif Minister Nandamuri Tharaka Rama Rao)విగ్రహం సమయంలో ఒక చిన్న హోటల్ వద్ద ఆగి టిఫిన్ చేశారు. సాధారణ వ్యక్తి లా షార్ట్ వేసుకొని వచ్చి పాకాల ఉన్న హోటల్ టిఫిన్ చేసి బిల్లు కడుతున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది తెగ వైరల్ అవుతుంది.
Also Read: Uttej Wife Padmavati Passed Away: ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం..
సాధారణ వ్యక్తిలా రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ చేసి బయటకి వచ్చి బిల్లు కట్టి వెళ్లిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వగా.. బన్ని సింప్లీసిటీకి (Allu Arjun simplicity) ఫ్యాన్స్ ఫిదా అవుతూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన (Rashmika Mandanna) నటిస్తుండగా.. మళయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తుండగా... ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నాడు.
Also Read: Andhra Pradesh: తస్మాత్ జాగ్రత్త... లీటర్ పెట్రోల్ కొట్టిస్తే పావు లీటర్ పెట్రోల్ మాయం..!!
ఆగష్ట్ 11 వ తేదీన విడుదలైన 'దాక్కో దాక్కో మేక' (Dakko Dakko Meka) మొదటి సాంగ్ లో ఊర మాస్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ 'తగ్గేదే లే' (Thaggedele) డైలాగ్ ఇప్పటికే చాలా ఫేమస్ అయిందన్న విషయం అందరికి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే కాకుండా ఎప్పుడేపుడా అని ఇటు అభిమానులు, అటు సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook