Pushpa: మామూలు మాస్ కాదండోయ్.. ఊర మాస్.. 'తగ్గేదే లే'

రింగు రింగుల జుట్టు, నోట్లో కత్తి, నుదుటి పెద్ద బొట్టు.. ఏంటో కాదండి అల్లు అర్జున్ పుష్ప సినిమా నుండి విడుదలైన ప్రోమోలో గెటప్. గెటప్ తో పాటు 'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే ప్రోమోలో అల్లు అర్జున్ చివర్లో చెప్పే 'తగ్గేదే లే' డైలాగ్ ప్రోమోకే హైలెట్ గా నిలిచాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2021, 07:32 PM IST
  • అదరగోట్టేసిన అల్లు అర్జున్ సినిమా సాంగ్ ప్రోమో
  • నోట్లో కత్తి పెట్టుకొని ఊర మాస్ లుక్ లో అల్లుఅర్జున్
  • ఆగస్టు 13న విడుదల కానున్న పుష్ప సినిమా సాంగ్
Pushpa: మామూలు మాస్ కాదండోయ్.. ఊర మాస్.. 'తగ్గేదే లే'

ఇప్పటి వరకు అల్లు అర్జున్- సుకుమార్ (Allu Arjun- Sukumar combo) కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా 'పుష్ప' (Pushpa). అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీలో ఒక బజ్ క్రియేట్ చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. టీజర్ విదులైన తరువాత అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నాడు. 

 

Also Read: తెలంగాణలో నేటి నుంచి మళ్లీ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ షురూ
ఈ రోజు 11 సెకన్ల నిడివి ఉన్న ప్రోమో రిలీజ్ చేసినప్పటికీ, ఈ పాటను  ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ టీజర్ లో అల్లు అర్జున్ రింగు రింగు ల జుట్టుతో నోట్లో కత్తి పెట్టుకొని ఊర మాస్ లుక్ లో ఆదరగోట్టేసాడనే చెప్పాలి. టీజర్ చివర్లో చెప్పే ‘తగ్గేదే లే’ డైలాగ్ ఇప్పటికీ వైరల్ అయింది. 

Also Read: Huzurabad Bypoll: టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ ను ప్రకటించిన గులాబీ బాస్!

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరనస రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. వీళ్లే కాకుండా యాంకర్ అనసూయ, సునీల్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News