Andhra Pradesh: తస్మాత్ జాగ్రత్త... లీటర్ పెట్రోల్ కొట్టిస్తే పావు లీటర్ పెట్రోల్ మాయం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తూనికలు కొలతలశాఖ చేపట్టిన తనిఖీల్లో పెట్రోల్ బంకుల్లో భారీ మోసాలు బయట పడ్డాయి. ఒక లీటర్ పెట్రోల్ లో పావు లీటర్ పెట్రోల్ కాజేస్తున్న బంకులను అధికారులు సీజ్ చేసారు... బంకుల్లో పెట్రోల్ కొట్టించే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2021, 04:07 PM IST
  • ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ బంకుల్లో బయటపడ్డ భారీ మోసం
  • లీటర్ పెట్రోల్ లో పావు లీటర్ కాజేస్తున్న బంకు యజమానులు
  • రిమోట్ కంట్రోల్ తో మైక్రో చిప్ లను ఆపరేట్ చేస్తూ మోసాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రెండు కోట్ల రూపాయల వరకు మోసాలు
Andhra Pradesh: తస్మాత్ జాగ్రత్త... లీటర్ పెట్రోల్ కొట్టిస్తే పావు లీటర్ పెట్రోల్ మాయం..!!

Andhra Pradesh Petrol Pumps cheating: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ (Petrol,Diesel Price) ధరలకు సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతుంటే.. మరో వైపు పెంట్రోల్ బంకుల్లో మోసానికి పాల్పడుతూ.. జేబులు నింపుకుంటున్న వైనం ఆంధ్రప్రదేశ్ లో (Andra Pradesh) వెలుగుచూసింది. ఎన్నో రోజుల నుండి జరుగున్న ఈ మోసాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 

పెరుతున్న రేట్లకి ఏం చేయాలో అర్థం కాక సామాన్యులు భయపడుతుంటే.. ఈ మోసాల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. 1 లీటర్ పెట్రోలు కొట్టిస్తే దాదాపు పావు లీటర్ పెంట్రోల్ కొట్టేస్తూ సామాన్య జనాలను మోసం చేస్తూ వినియోగదారులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో మైక్రో చిప్ లను అమర్చి దోపిడీకి పాల్పడుతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ వెలుగుచూసింది. 

Also Read: Uttej Wife Padmavati Passed Away: ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం..

రాష్ట్ర వ్యాప్తంగా 600 పెట్రోల్ బంకుల్లో చేపట్టిన తూనికలు కొలతలశాఖ (LEGAL METROLOGY Department of AP) చేపట్టిన తనిఖీల్లో మరోసారి మైక్రో చిప్స్ (Micro Chips) బయటపడ్డాయి. అధికారులు సోదా చేసిన బంకుల్లో పెద్ద ఎత్తున మోసాలు బయటపడటంతో సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

టెక్నాలజీ టాంపరింగ్ తో తప్పుడు కొలతల చూపిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు బ్యాంకు యజమానులు. బంకుల్లో మైక్రో చిప్ లను అమర్చి.. చూస్తుండగానే పెట్రోల్ కొట్టేసి, అటు సామాన్యులను, ప్రభుత్వాలను మోసం చేస్తున్న బంకులను సీజ్ చేసారు. జరిగిన తూనికలు కొలతలశాఖ (LEGAL METROLOGY Department of AP) చేపట్టిన తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా  17 బంకుల్లో మైక్రో చిప్ లను అమర్చి మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు దృవీకరించారు . వీటిలో విజయవాడ గుణదలలో ఓ పెట్రోల్ బంక్ ను సీజ్ చేయటమే కాకుండా, పెట్రోల్ బంక్ యజమాని పై కేసు నమోదు చేసారు. ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) లో ఎక్కువగా కృష్ణాజిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ రకం మైక్రో మోసాలకు పాల్పడుతున్నారని, ఈ జిల్లాలోనే ఈ మైక్రో చిప్ ల మోసాలను గుర్తించామని అధికారులు తెలిపారు. 

Also Read: Coconut @ 6.5 lakhs: ఆ కొబ్బరికాయ ప్రత్యేకత ఏంటి, ఎందుకు 6.5 లక్షలకు అమ్ముడైంది

అధికారులు నిరంతరం తనిఖీ చేయటంతో మోసాలకు పాల్పడే పెట్రోల్ బంక్ యజమానులు కొత్త రకం వ్యవస్థలను కనుగొంటున్నారు. మదర్‌ బోర్డ్ (Mother Board), పల్సర్‌ బోర్డ్ (Pulsar Board), డిస్‌ ప్లే బోర్డులలో (Display Boards) చిప్‌లు ఏర్పాటు చేసి వాటికి రిమోట్‌ కంట్రోల్‌ (Remote Control) అనుసంధానం చేసి కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. అధికారులు తనిఖీలకు రాగానే వాటిని రిమోట్‌ సహాయంతో సాధారణ స్థితికి వచ్చేట్టుగా చేస్తూ, వారు వెళ్ళగానే వాటిని మళ్లీ యాక్టివేట్ చేస్తూ తెలివిగా అధికారులను బురిడి కొట్టిస్తున్నారు. 

ఇలా అధునాతన టెక్నాలజీ సహాయంతో లీటరుకు పావు లీటర్ దోపిడీ ద్వారా భారీ మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా పెట్రో మోసాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బంక్ యజమానులు దాదాపు 2 కోట్ల రూపాయలపైనే కొల్లగొడుతున్నరాని అధికారులు తెలుపున్నారు. ఇకనైన ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలని సామాన్య ప్రజలు అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. 

Also Read: Reliance-T Series Movies: రిలయన్స్-టీ సిరీస్ ఆధ్వర్యంలో భారీ బడ్జెట్ సినిమాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News