Allu Sneha Reddy New Year Resolution అల్లు అర్జున్ సోషల్ మీడియాలో దుమ్ములేపేస్తుంటాడు. ఇక బన్నీ భార్యగా అల్లు స్నేహారెడ్డికి కూడా ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. బన్నీకి సంబంధించిన అప్డేట్లు, పిల్లల వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ మధ్య స్నేహా రెడ్డి అందాల ప్రదర్శనలోనూ ఆరి తేరిపోతోంది. స్టార్ హీరోయిన్‌ను తలదన్నేలా స్నేహా రెడ్డి ఫోటో షూట్లు చేస్తోంది. బన్నీ సైతం తన భార్య మీద నాటీ కామెంట్లు చేస్తుంటాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు స్నేహా రెడ్డి ఫోటోలు ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. స్నేహా రెడ్డి ఈ మధ్య ఎక్కువగా ప్రీతమ్ జుకల్కర్, సాధన సింగ్‌లు మేకప్, స్టైలీష్ట్‌ల డిజైన్లలోనే కనిపిస్తోంది. ఇక స్నేహా రెడ్డి తన ఫాలోవర్లతోనూ ఇంటరాక్ట్ అవుతోంది. తాజాగా స్నేహా రెడ్డి తన ఫాలోవర్లతో చిట్ చేసింది. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.


ఏ ఫుడ్ అంటే ఇష్టమని అడిగేశాడు ఓ నెటిజన్. ఇండియన్ ఫుడ్ అని సమాధానం ఇచ్చింది స్నేహారెడ్డి. మీరు మార్నింగ్ పర్సనా? నైట్ పర్సనా? అని మరో నెటిజన్ అడిగాడు. నాకు మార్నింగ్ అంటే ఇష్టమని చెబుతూ సూర్యోదయం ఫోటోను షేర్ చేసింది. ఇక బన్నీ ఏమని పిలుస్తాడు? ఏదైనా నిక్ నేమ్ ఉందా? అని ఇంకో నెటిజన్ అడిగాడు. క్యూటీ అని పిలుస్తాడంటూ అసలు సీక్రెట్ చెప్పేసింది స్నేహా రెడ్డి.


[[{"fid":"257122","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


రాబోయే కొత్త ఏడాదికి గానూ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నారా? పాటించాలని అనుకుంటున్నారా? అని ఓ నెటిజన్ అడిగాడు. ఈ ప్రశ్నకు స్నేహా రెడ్డి వింత సమాధానం ఇచ్చింది. అయాన్‌తో కలిసి కిచెన్‌లో వంట వండాలని అనుకుంటున్నాను అంటూ తన కొత్త రిజల్యూషన్ గురించి చెప్పింది. అంటే ఇక బన్నీ ఈ ఇద్దరి వంటలు తింటాడా? అర్హను పూర్తిగా బన్నీకే వదిలేస్తుందా? అయితే బన్నీకి ఇక కష్టమే అన్నట్టు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.


Also Read : Alia Bhatt Fitness : తలకిందులుగా వేలాడుతోన్న అలియా భట్.. మళ్లీ పని మొదలెట్టేసినట్టుందిగా


Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook