Mega Family vs Allu Family: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు సినీ కుటుంబంలో చిచ్చును రాజేసింది. ఇన్నాళ్లు కొన్ని భేదాభిప్రాయాలతో ఉన్నా కూడా కలిసి కట్టుగా కనిపించారు. కానీ ఏపీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా ఆ సినీ కుటుంబం రెండుగా చీలిపోయింది. ఈ వివాదానికి ఆజ్యం పోసింది మాత్రం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఏపీ ఎన్నికల పర్యటనలో కుటుంబానికి విరుద్ధంగా ఓ పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లడంతో తీవ్ర దుమారం రేపింది. అయితే ఫలితాల్లో మాత్రం బన్నీ ప్రచారం చేసిన పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాల కారణంగా చిరంజీవి కుటుంబం వర్సెస్‌ అల్లు కుటుంబంగా మారింది. ఈ రెండూ కుటుంబాలు తీవ్ర వివాదం నడుస్తోందని తెలుస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్‌లో చిరంజీవి కుటుంబసభ్యులు చేసుకున్న సంబరాలే నిదర్శనం. ఈ వేడుకల్లో అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీశ్‌ ఎలా ఆ కుటుంబానికి చెందిన వారెవరూ కనిపించలేదు.

Also Read: YS Sharmila: నాడు అన్నను గెలిపించిన చెల్లెలు.. నేడు అన్నను ఓడించిన షర్మిల


 


ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు అనూహ్యంగా హీరో అల్లు అర్జున్‌ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు. తన మామయ్య, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురంలో కాకుండా వారికి ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేశాడు. తన చిరకాల స్నేహితుడు కావడంతో బన్నీ ప్రచారానికి వచ్చాడు.

Also Read: Govt Advisers: వైఎస్‌ జగన్‌కు కాబోయే సీఎం చంద్రబాబు భారీ దెబ్బ.. వారంతా ఔట్‌


 


అయితే మామయ్య పార్టీ జనసేనకు మద్దతు తెలపకుండా ప్రత్యర్థి పార్టీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్‌ ప్రచారం చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమలోనూ కలవరం మొదలైంది. అయితే అనూహ్యంగా ఎన్నికల ఫలితాల్లో అల్లు అర్జున్‌ మద్దతు తెలిపిన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. జనసేనతో జత కట్టిన టీడీపీ, బీజేపీ కూటమి అత్యధిక స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ గెలుపొందారు. 


విజయం అనంతరం పవన్‌ కల్యాణ్‌ తొలిసారి హైదరాబాద్‌లోని తన అన్న చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ సంబరాలు అంబరాన్నంటాయి. ఆ వేడుకల్లో కొణిదెల కుటుంబం మొత్తం పాల్గొంది. కానీ అల్లు కుటుంబం కనిపించలేదు. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌, అతడి కుమారులు అల్లు అర్జున్‌, శిరీష్‌తోపాటు అతడి కుటుంబసభ్యులు ఎవరూ కూడా పాల్గొనలేదు. వారి గైర్హాజరుతో మరోసారి చిరంజీవి, అల్లు కుటుంబం మధ్య వివాదం ముదిరిపోయిందని తెలుస్తోంది. ఇప్పుడు సినీ పరిశ్రమలో కొణిదెల, అల్లు కుటుంబం అంటూ రెండుగా విడిపోతుందని తెలుస్తోంది.


సోషల్ మీడియాలో యుద్ధం
ఈ వివాదం అభిమానుల మధ్య తీవ్ర వివాదం రేపుతోంది. ఎన్నికల్లో విజయంతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అల్లు కుటుంబం లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ వర్సెస్‌ మెగా ఫ్యాన్స్‌గా మారింది. సోషల్‌ మీడియాలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇది కొన్ని రోజులకు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఈలోపే అల్లు, కొణిదెల కుటుంబం ఒక స్పష్టత ఇస్తే మేలు జరుగుతుంది. లేకపోతే పరస్పరం దాడులు చేసుకునే దాకా చేరే ప్రమాదం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter