Ambajipeta Marriage Band: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో రేణుక క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి శరణ్య. ఈ సినిమాలో సాయి పల్లవికి అక్కగా కనిపించి అందరిని మెప్పించింది. ఆ తరువాత ఎన్నో చాన్సులు అందుకుంటే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈమధ్య వచ్చిన సుహాసినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో కీలక పాత్రలో కనిపించి మంచి పేరు తెచ్చుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సినిమా మొత్తానికి శరణ్య క్యారెక్టర్ హైలైట్ గా నిలవడం విశేషం. ఇందులో పద్మ అనే పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. తనలో ఇంత మంచి నటి ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.  ఈ చిత్రంలో హీరో సుహాస్‌‌ను మించి హైలైట్ గా నిలిచింది శరణ్య క్యారెక్టర్. కొన్ని సీన్లలో శరణ్య నటన ప్రేక్షకులతో విజిల్స్ కూడా  కొట్టిస్తుంది. ముఖ్యంగా వీళ్ళని శరణ్య కాళ్లతో కొట్టే సిన్ ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచింది. 


అయితే ఈ సినిమా కథ మొత్తం మలుపు తిరిగేది ఒక్క సీన్ తో.. ఆ సీన్ ఏది అంటే స్కూల్లో విలన్ ఆమెను వివస్త్రను చేసే సన్నివేశం. సినిమా మొత్తానికి ఆ సీన్ చాలా ముఖ్యమైనది కాబట్టే.. శరణ్య తప్పకుండా అటువంటి సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. ఈ సీన్లో శరణ్య నగ్నంగా ఉన్నట్లు చూపిస్తారు. ఇలాంటి సన్నివేశాలు తెర మీద ఒకలా కనిపించినా.. ఒరిజినల్‌‌గా అలా ఉండదు. అది అర్థం చేసుకునేవారు కొంతమంది అయితే మరి కొంతమంది మాత్రం ఇలాంటి సీన్స్ యూట్యూబ్ లో పెట్టి అసభ్యకరమైన థంబ్ నైల్స్ చేస్తూ ఉంటారు.


ఇప్పుడు ఈ సీన్ కూడా యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు వ్యూస్ కోసం అలాంటి చీప్ థంబ్ నైల్స్ క్రియేట్ చేసి పెట్టాడు. ఇలా వాళ్ళు చెయ్యడం పై శరణ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నాకు పెళ్లయింది. నా భర్త మద్దతుతోనే నేను ఆ సీన్ చేశాను. సినిమాలో నిజానికి ఏమీ లేకపోయినా.. ఏదో ఉన్నట్లు అసభ్యంగా థంబ్ నైల్స్ పెట్టి యూట్యూబ్ ఛానెళ్లు.. వాళ్ల వ్యూస్ కోసం  ప్రచారం చేశాయి. అందులో అసలు అసభ్యత ఉండదు. నేను చాలా వీడియోస్ ని రిపోర్ట్ చేసిన పెద్దగా లాభం లేకపోయింది. ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు’’ అని శరణ్య చెప్పుకొచ్చింది.


Also Read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే


Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?


 



 


 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter