Amit Shah to meet Nikhil Soon: కొన్ని రోజుల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత, ఆ పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం అటు రాజకీయ వర్గాల్లో టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయ సంబంధం లేని భేటీ అని బీజేపీ నేతలు కొందరు చెబుతుంటే కచ్చితంగా రాజకీయాలతో సంబంధం ఉందని మరికొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదలా ఉంచితే తర్వాత మరో బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చినప్పుడు సినీ హీరో నితిన్ తో భేటీ అయ్యారు. తరువాత నితిన్ స్వచ్ఛందంగా కలవడానికి వచ్చారని బీజేపీ కోసం ఆయన ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారని కూడా బీజేపీ నేతలు చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమిత్ షా ఈనెల 17వ తేదీన మరోసారి హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కేంద్రం కొన్ని ఉత్సవాలు చేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు.


ఈ సమయంలో ఆయన హీరో నిఖిల్ ను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజానికి జేపీ నడ్డా కార్తికేయ 2 సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో నిఖిల్ ని కలవాలనుకున్నారు. కానీ లోకల్ బీజేపీ లీడర్లకి ఆ విషయం అర్థం కాక నిఖిల్ బదులు నితిన్ ని పిలిచారని చెబుతున్నారు. ఇక ఆ కన్ఫ్యూజన్ తొలగించడం కోసం అమిత్ షా నిఖిల్ తో భేటీ అవుతారని అంటున్నారు. 


Amit Shah to meet Ram Charan: ఆ తరువాత మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ Amit Shah to meet allu arjun వంటి వారితో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేకపోయినా కలిసినప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయమని కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


వారు ఎలాగో సపోర్ట్ చేయరు కానీ ఒకవేళ సపోర్ట్ చేస్తే అది ప్లస్ అవుతుంది. సపోర్ట్ చేయకపోతే బీజేపీ నేతలతో హీరోలు వరుసగా భేటీ అవుతున్నారనే విషయాన్ని కూడా బీజేపీకి అనుకూలంగా మలుచుకోవచ్చని అంచనాలున్నాయి. టాలీవుడ్ సహా అందరూ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారని బీజేపీ నేతలు బయటకు చెప్పుకోవడం కోసమే ఇలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.


ముందుగా ఎన్టీఆర్ తర్వాత నితిన్ ఇప్పుడు నిఖిల్ అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు తమకు మద్దతుగా ఉన్నారని వాళ్ళు చెప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బిజెపిలో ఉండడంతో ప్రభాస్ ఒక రకంగా బిజెపికి సపోర్టుగానే ఉంటారు. గతంలో కూడా ఆయన ప్రధానితో భేటీ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఇలా టాలీవుడ్ మొత్తాన్ని తమ వైపుకు తిప్పుకొని తమకు బలం పెరిగిందని తెలంగాణలో నిరూపించుకునే ప్రయత్నం కోసమే ఈ భేటీలు జరుగుతున్నాయనే ప్రచారం అయితే జరుగుతుంది.
 Also Read: Nagarjuna vs Amala: పోటాపోటీగా అమల-నాగార్జున సినిమాలు రిలీజ్!


Also Read: Brahmastra Twitter Review : బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి