Ananya Nagalla reacts on wedding rumours with Tollywood Producer Son: తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మల్లేశం సినిమా అనంతరం 'ప్లే బ్యాక్' సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాతో అనన్య పాపులర్ అయ్యారు. మ్యాస్ట్రో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనన్య నాగళ్ల నటిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. హీరోయిన్‌గా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫుల్‌ బిజీగా ఉండే తెలుగమ్మాయి అనన్యపై ఇటీవల కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అనన్య త్వరలోనే పెళ్లిచేసుకోనుందనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ బడా నిర్మాత రెండో కుమారుడిని అనన్య వివాహం చేసుకోనునారునై సోషల్‌ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్స్‌లలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ ఇద్దరు హీరోలే అని నెటిజన్లు అనుకుంటున్నారు. 



తాజాగా అనన్య నాగళ్ల తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు వరుడిని వెతికినందుకు థాంక్స్ చెప్పారు. అలానే పెళ్లి డేట్, వేదికను కూడా చెప్పని సెటర్లు వేశారు. 'నాకోసం పెళ్లి కుమారుడిని వెతికినందుకు చాలా థాంక్స్. పెళ్లి కుమారుడు ఎవరో.. మ్యారేజ్ డేట్, వేదిక నాకు కూడా చెప్పండి. దాంతో నా పెళ్లికి నేను కూడా హాజరుకాగలను' అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న‘శాకుంతలం’ సినిమాలో అనన్య నటించారు.


Also Read: రూ.150 కోట్ల క్లబ్‌లో పొన్నియన్‌ సెల్వన్‌.. తమిళనాడులో రికార్డు కలెక్షన్స్‌!


Also Read: IND vs SA 2nd T20I: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 మ్యాచ్‌ కష్టమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook