Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద అనసూయ స్పందిస్తుంటుంది. అది కాంట్రవర్సీకి దారి తీస్తుంటుంది. దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ట్రోలర్ల మీద అనసూయ కూడా అంతే స్థాయిలో విరుచుకపడుతుంటుంది. ఇదొక సర్కిల్‌లా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ట్రోలింగ్ ఎంత జరుగుతున్నా కూడా అనసూయ మాత్రం వెనక్కి తగ్గదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన మీద జరిగే ట్రోలింగ్, చేసే ట్రోలర్లకు కౌంటర్లు ఇస్తుంటుంది. అందరి మీదా కేసులు పెడతానంటూ అనసూయ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమా సమయంలో అనసూయ వేసిన ట్వీట్, రేగిన వివాదం, ఆంటీ అంటూ అనసూయను నెటిజన్లు ఆడుకోవడం, అనసూయ కూడా కేసులు వేస్తానంటూ బెదిరించడం అందరికీ తెలిసిందే.


అలా అనసూయ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది. తాజాగా అనసూయ తనకు జరిగిన చేదు అనుభవం గురించిచెప్పుకొచ్చింది. ఇందులో ఎయిర్ పోర్ట్‌లో విమానాయాన సంస్థ చేసిన పనుల గురించి చెప్పుకొచ్చింది. అలియన్స్ ఎయిర్ సంస్థ మీద ఆరోపణలు చేసింది. చెప్పిన టైంకు ఫ్లైట్ రాలేదని, ఎన్నో ఆపసోపాలు పడి చివర బోర్డింగ్ వరకు వెళ్లానని అంది.


[[{"fid":"248851","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అయితే అప్పటి వరకు మాస్క్ కంపల్సరీ అనే నిబంధన ఎక్కడా లేదని, చివరి నిమిషంలో మాత్రం మాస్క్ కంపల్సరీ అని చెప్పి.. మాస్క్ లేదనే కారణంతో అక్కడే వెయిట్ చేయించారట.. తన పిల్లలతో అలానే ఉండిపోయిందట. చివరకు ఫ్లైట్ లోపలకు వెళ్తే.. తలా ఓ దిక్కునా కూర్చోబెట్టేశారట. అందరం కలిసి ఒకే చోట వచ్చేలా బుక్ చేసుకున్నా కూడా ఇలా తనను, తన పిల్లలను అందరినీ వేర్వేరు చోట కూర్చోబెట్టారట. ఇక సీట్ల వల్ల తన డ్రెస్ కూడా చిరిగిపోయిందని ఇలా తనకు జరిగిన చేదు అనుభవాన్ని అనసూయ చెప్పుకొచ్చింది.


Also Read : Nirupam Paritala - Premi Viswanath : కార్తీకదీపం సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే


Also Read : Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలు పడుతున్న చిన్మయి.. ఆనందంలో తేలిపోతోన్న సింగర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook