Anasuya Khiladi: నిన్న దాక్షాయణి, నేడు చంద్రకళ.. అనసూయ `ఖిలాడీ` లుక్ పోలా అదిరిపోలా!!
ఖిలాడీ చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో అనసూయ భరద్వాజ్ అదరహో అనిపిస్తున్నారు. చీరకట్టులో అనసూయ అందంగా సిగ్గు పడుతూ ఉన్నారు.
Anasuya Bharadwaj First Look out From Khiladi Movie: అనసూయ భరద్వాజ్.. ఈపేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ.. అనతి కాలంలోనే తన అందం, యాంకరింగ్‌తో పాపులర్ అయ్యారు. స్టార్ యాంకర్ అయిన అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించిన అనుకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ఇటీవల అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రంలో అనసూయ ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో మొరటుగా కనిపించారు. పుష్ప పార్ట్ 2లో అను పాత్ర కీలకం కానుందట. అనసూయ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న 'ఖిలాడీ' చిత్రంలో నటించారు. పుష్ప చిత్రంలో దాక్షాయణిగా మెప్పించడంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. దాంతో ఖిలాడీ చిత్రంలో ఆమె ఎలాంటి రోల్ పోషిచిందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠతకి తెర దించుతూ చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే అనసూయ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.
ఖిలాడీ చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో అనసూయ అదరహో అనిపిస్తున్నారు. చీరకట్టులో అందంగా సిగ్గు పడుతూ ఉన్నారు. అనసూయ లుక్ చూడ ముచ్చటగా ఉంది. ఖిలాడీ మూవీలో ఆమె డ్యూయెల్ రోల్ చేస్తుందట. అనసూయ కోసం రమేష్ వర్మ బలమైన పాత్రనే సృస్టిస్తునట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో అనసూయ బ్రాహ్మణ యువతిగా కనిపించనుందట. ఇక ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
Also Read: Alia Bhatt Hot photos: 'గంగూబాయ్' బ్యూటీ ఆలియా భట్ అందాల విందు..
Also Read: Home Vastu Tips: గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దు.. చేస్తే అరిష్టమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook