Home Vastu Tips: గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దు.. చేస్తే అరిష్టమే..

Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మంపై కూర్చోవడం, అక్కడ కూర్చొని తినడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయొద్దు. అలా చేస్తే అరిష్టమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 05:18 PM IST
  • వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించిన చిట్కాలు
  • గుమ్మంలో కూర్చొని తినవద్దు, గోర్లు కత్తిరించవద్దు
  • గుమ్మంపై నిలబడటం మంచిది కాదు
Home Vastu Tips: గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దు.. చేస్తే అరిష్టమే..

Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మంలో దేవుడు కొలువై ఉంటాడు. అందుకే ఇంటి గుమ్మంపై నిలబడవద్దని పెద్దలు తరచూ చెబుతుంటారు. అంతేకాదు, ఇంటి గుమ్మంలో కూర్చొని తినవద్దని కూడా చెబుతారు. పురాణాల ప్రకారం గుమ్మంలో కూర్చోవడం లేదా దానిపై అడుగుపెట్టడం పేదరికాన్ని ఆహ్వానించనిట్లే. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మంలో కూర్చొని తినడం లేదా గుమ్మంలో నిలబడటం చేయవద్దు.

ఇంటి ప్రధాన ద్వారం ముందు షూ లేదా చెప్పులు ఉంచవద్దు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు బూట్లు, చెప్పులు ఉంచకూడదు. ఇంటి ప్రధాన ద్వారం ముందు షూ, చెప్పులు ఉంచడం ద్వారా లక్ష్మీ దేవీ అవమానానికి గురై ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఇది కుటుంబంలో ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది. ఎవరైనా సరే ఆర్థికంగా వృద్ది చెందాలంటే లక్ష్మీ దేవి కటాక్షం తప్పనిసరి అని గుర్తించాలి. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో కొలువయ్యేలా చూసుకోవాలి తప్ప.. దేవతకు ఆగ్రహం తెప్పించే చర్యలకు పూనుకోవద్దు.

గుమ్మంలో చేతి గోర్లు కత్తిరించవద్దు :

వాస్తు శాస్త్రం (Vastu Shastra) ఇంటి గుమ్మంలో లేదా ఇంటి ముందు కూర్చొని గోర్లు కత్తిరించవద్దు. ఇలా చేయడం వల్ల ఇంటికి దరిద్రం వస్తుంది. గుమ్మం ముందు కూర్చుని మాంసం తినడం కూడా అరిష్టం. అలాగే గుమ్మానికి క్యాలెండర్లు, గడియారాలు వంటివి వేలాడదీయవద్దు. ఇంటి ఈశాన్య మూలలోని తూర్పు భాగంలో లక్ష్మీ దేవి చిత్రపటాన్ని ఉంచితే ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది. 

Also Read: Allu Arjun Zomato: మనసు కోరితే తగ్గేదే లే.. జొమోటో ఓపెన్ చేయడమే! అరె బన్నీ కూడా ఏసేశాడుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News