Hamida Khatoon New Benz Car : బిగ్ బాస్ బ్యూటీ హమీద తాజాగా తన సంతోషాన్ని తన అభిమానులతో పంచుకుంది. ఈ దుబాయ్ బ్యూటీ కొత్త కారు కొనేసింది. బెంజ్ కారు కొన్నానంటూ తాను చేసిన సందడిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు యాంకర్ రవి ఫ్యామిలీ కూడా ఈ కారు కొనే ప్రక్రియలో సందడి చేసింది. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో హమీద శ్రీరామ్ ట్రాక్ ఎంతగా వర్కౌట్ అయిందో అందరికీ తెలిసిందే. యాంకర్ రవి హమీద శ్రీరామ్ ఇలా అంతా కూడా ఓ గ్యాంగ్‌లా ఉండేది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బయటకు వచ్చిన తరువాత వీరంతా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇక హమీద అయితే రవి ఫ్యామిలీతోనే ఎక్కువగా కనిపిస్తోంది. శ్రీరామచంద్ర, హమీద, రవి, సిరి ఇలా అందరూ కలిసి సందడి చేస్తుంటారు. ఇక ఇప్పుడు హమీద కొన్న కొత్త కారు గురించి రవి పోస్ట్ వేశాడు. అందులో తామంతా కలిసి ఆ కొత్త కారును ఎలా ఓపెన్ చేశారో చూపిస్తూ, ఫస్ట్ రైడ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.


 



అనంతమైన ప్రేమ అంటూ తన కొత్త కారుకు సంబంధించిన పోస్ట్ వేసింది. దీనిపై శ్రీరామచంద్ర స్పందించాడు. కంగ్రాట్స్ అని చెప్పాడు. థాంక్యూ అంటూ శ్రీరామచంద్రకు థాంక్యూ అని కామెంట్ పెట్టింది హమీద. ఇక రవి అయితే హమీదకు కంగ్రాట్స్ చెబుతూ.. జాగ్రత్తగా డ్రైవ్ చేయ్ అంటూ సలహా ఇచ్చాడు. అయితే ఈ కారు విలువ మాత్రం కనిష్టంగా యాభై లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది.


వెల్కమ్ ది బీస్ట్.. హమీద కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది.. నీ కొత్త ప్రాజెక్ట్‌లకు ఆల్ ది బెస్ట్.. దయచేసి జాగ్రత్తగా డ్రైవ్ చేయ్ అంటూ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొత్త కారు ఓపెనింగ్‌కు సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ తరువాత హమీద ఇంత వరకు ఒక్క సినిమా ప్రాజెక్ట్‌ను కూడా సైన్ చేయనట్టు కనిపిస్తోంది. కానీ రవి మాత్రం రాబోయే ప్రాజెక్ట్‌లకు ఆల్ ది బెస్ట్ అని చెప్పడం చూస్తుంటే.. త్వరలోనే సినిమాలతో తన అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.


Also Read : Vishnu Manchu Wife : ఆపనికి ఇంట్లో ఒప్పుకోవడం లేదట!.. మంచు విష్ణు ట్వీట్.. నెటిజన్ల కౌంటర్లు


Also Read : Rakul Preet Bikini Pics : బికినీలో రిలాక్స్ అవుతున్న రకుల్.. పిక్స్‌తో పిచ్చెక్కిస్తోందిగా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook