Anchor Suma in Where is the Party బుల్లితెరకు, సుమకు ఉన్న బంధం విడదీయరానిది. ముందు ఆమె సీరియల్స్, సినిమాలు అంటూ బిజీగా ఉన్నా కూడా యాంకర్‌గానే జనాలకు ఎక్కువ దగ్గరైంది. సుమ చేసిన షోలు, చేస్తూ ఉన్న షోలు అందరినీ అలరిస్తూ ఉంటాయి. సుమ అయితే బుల్లితెరపై రికార్డులు క్రియేట్ చేసింది. స్టార్ మహిళ అనే షోలు ఏళ్లకు ఏళ్లు సక్సెస్‌ఫుల్‌గా నడిపి, వేల ఎపిసోడ్లు చేసిన సుమ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే అలాంటి సుమ ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉండబోతోన్నట్టుగా కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే ఇప్పుడు మల్లెమాల నుంచి అందరూ బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య సుధీర్ వెళ్లిపోయాడు. ఆది మధ్యలో వస్తాడు వెళ్తాడు. అనసూయ అయితే పూర్తిగా వెళ్లిపోయింది. స్టార్ మా నుంచి మల్లెమాలకు కొందరు వస్తున్నారు.. మల్లెమాల నుంచి చాలా మంది బయటకు వెళ్తున్నారు. ఈ మధ్యే సత్య, సద్దాం అండ్ టీం ఇలా అంతా కూడా మల్లెమాలకు వచ్చారు. ఇది తమ హోం ప్రొడక్షన్ అంటూ భారీ డైలాగ్స్ కొట్టేస్తున్నారు.


 



అయితే తాజాగా సుమ సైతం మల్లెమాల నుంచి బయటకు వెళ్లబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఆల్రెడీ ఆలీ అయితే అలీతో సరదాగా షోను కూడా వదిలేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. వైసీపీలో పదవి రావడంతో ఇలా బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడేమో. కానీ ఇప్పుడు సుమ సైతం బయటకు వచ్చేస్తోంది. ఈ మేరకు గ్యాప్ తీసుకుంటున్నట్టుగా సుమ చెబుతూ కంటతడి పెట్టేసుకుంది.


మలయాళీగా పుట్టిన నేను ఇక్కడ సెటిల్ అయ్యానంటే.. కేవలం తెలుగు వాళ్లు ఇచ్చిన అభిమానం, ప్రేమ.. అవి లేకపోతే నేను లేను. కానీ కొంత విరామం అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. సుమ మాటలు చూస్తుంటే.. ఇక బుల్లితెరకు దూరంగా ఉండేలా కనిపిస్తోంది. సినిమాలు, సినిమా ఈవెంట్లు, వెబ్ సిరీస్‌లు అంటూ మరింత బిజీగా ఉండబోతోందేమో.


Also Read : Singer Chinmayi Video : న్యూడ్ ఫోటో లీక్ చేస్తానంటూ బెదిరింపులు.. చిన్మయి వీడియో వైరల్


Also Read : Allu Arjun Pushpa : పుష్ప రాజ్‌ను కౌగిట్లో బంధించేసిన స్నేహా రెడ్డి.. అల్లు వారి ప్రేమ.. వైరల్ పిక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook