Pawan In Allu Arjun House:పుష్ప 2 సినిమా విడుదలకు ఒక రోజు ముందు వేసిన ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మృతి చెందడంలో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఈ కేసులో తెలంగాణ పోలీసుల అల్లు అర్జున్ ను ఏ 11గా చేరుస్తూ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఘటనలో ఒక పూట జైలులో గడిపిన అల్లు అర్జున్.. నిన్న ఉదయం బెయిల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే కదా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో   అల్లుఅర్జున్‌ కు సంఘీభావం తెలుపుతూ టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు కలుస్తున్నారు. ప్రభాస్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శించారు. అటు షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న ఎన్టీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించినట్టు అల్లు అర్జున్ పీఆర్ టీమ్ తెలిపింది. మరోవైపు బాలీవుడ్ కు చెందిన నటీనటులు బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు అల్లు అర్జున్ అరెస్ట్ తీరును ఖండించారు.


 మొత్తంగా బన్ని అరెస్ట్ తో మెగా కుటుంబంలో కలకలం రేపింది. అల్లు ఇంటికి పోలీసులు వచ్చారని తెలియగానే మెగా కుటుంబ సభ్యులు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. చిరంజీవి దంపతులతో పాటు నాగబాబులు అరవింద్ తో కలిసి లాయర్లలో మంతనాలు జరిపారు.  అల్లు అర్జున్‌ విడుదల అయిన తరువాత చిరంజీవి సతీమణి సురేఖ మేనల్లుడిని చూసి భావోధ్వేగానికి లోనయ్యారు. కాగా బన్నీ అరెస్ట్‌ అయినప్పుడు  అమరావతిలో కీలక సమావేశం ఉండటంతో పవన్ కల్యాణ్ హైదరాబాద్ రాలేదు. రాత్రి హైదరాబాద్ వచ్చిన పవన్..అల్లు అర్జున్ కోసం అరవింద్ ఇంటికి రానున్నారు.


ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..


ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.