Anil Sunkara Agent Movie టాలీవుడ్‌ లో ప్రస్తుతం పెద్ద హీరోలతో సినిమాలు చేసే పెద్ద నిర్మాతల్లో కొద్ది మంది మాత్రమే యాక్టివ్‌ గా ఉన్నారు. అల్లు అరవింద్‌.. సురేష్ బాబు.. అశ్వినీదత్ వంటి వారు చాలా తక్కువ సినిమాలు నిర్మిస్తున్నారు. ఏడాదికి రెండేళ్లకు ఒకటి రెండు చొప్పున సినిమాలు చేస్తున్నారు. కానీ కొందరు నిర్మాతలు మాత్రం వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఏడాదికి నాలుగు అయిదు సినిమాలను కూడా ఆయా నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అందులో మైత్రి మూవీ మేకర్స్ వారు ఒకరు కాగా పీపుల్స్ మీడియా వారు కూడా ఉంటారు. వీరు మాత్రమే కాకుండా అనిల్ సుంకర కూడా టాలీవుడ్‌ లో భారీ బడ్జెట్‌ చిత్రాలను వరుసగా చేస్తూ ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో అనిల్ సుంకర ఇప్పటి వరకు రూ.150 కోట్ల వరకు నష్టపోయాడు అనే వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక వైపు మెగాస్టార్‌ చిరంజీవితో భోళా శంకర్ సినిమాను నిర్మిస్తున్న అనిల్ సుంకర మరో వైపు అఖిల్‌ హీరోగా ఏజెంట్‌ సినిమాను నిర్మించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అఖిల్ అక్కినేని మూవీ ఏజెంట్‌ తీవ్రంగా నిరాశ పర్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్‌ సినిమా దాదాపుగా 25 కోట్ల రూపాయలు నష్టపర్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం ఏజెంట్‌ మాత్రమే కాకుండా అనిల్ సుంకర గతంలో నిర్మించిన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచి భారీగా నష్టాలను మిగిల్చాయి. ఏజెంట్‌ సినిమా స్థాయిలో కాకున్నా చాలా సినిమాలు అనిల్ సుంకర కు లాస్ అవ్వడం వల్లే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో రూ. 150 కోట్ల వరకు నష్టపోయి ఉంటాడు అంటూ ఒక వర్గం ప్రేక్షకులు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. 


 



ఇక ఏజెంట్‌ సినిమా ఫ్లాప్ పై నిర్మాత అనిల్ సుంకర స్పందించాడు. ఫ్లాప్ కు పూర్తి బాధ్యతని మేము తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. ఏజెంట్‌ సినిమా విషయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని విజయాన్ని సొంతం చేసుకోవాలి అనుకున్నాం. మేము ఈ సినిమా షూటింగ్ కు బౌండ్ స్క్రిప్ట్‌ తో వెళ్లలేదు. అలా చేయక పోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటూ అనిల్ సుంకర స్వీయ విశ్లేషణలో పేర్కొన్నాడు. అయితే ఈ తప్పుతో తాము బాధ పడము అని.. ఈ పరాజయంను ఎవరి మీద వేయకుండా తమ బాధ్యతగానే స్వీకరిస్తామని అనిల్ సుంకర పేర్కొన్నాడు. ముందు ముందు మంచి ప్లానింగ్ తో వెళ్తామని కూడా పేర్కొన్నాడు. 


Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్


అనిల్ సుంకర ఇంత భారీగా నష్టాలు వస్తున్నప్పటికి కూడా సినిమా మేకింగ్ విషయంలో వెనక్కు తగ్గేది లేదు అంటున్నాడు. సినిమా మేకింగ్ లో అనిల్ సుంకరకు నష్టం వచ్చి ఉండవచ్చు. కానీ ఆయనకు ఇతర బిజినెస్ లు చాలానే ఉన్నాయని.. అందుకే ఈ నష్టంను అక్కడ వచ్చే లాభాలతో భర్తీ చేస్తున్నాడేమో అంటూ కొందరు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైతేనేం అనిల్‌ సుంకర నష్టాలను పట్టించుకోకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు భారీగా ఖర్చు పెడుతున్నాడు.


Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook