Naa Saami Ranga: అంజిగాడి గ్లింప్స్ వచ్చేసింది.. మాటొచ్చేత్తది అంటూ నవ్వులు పూయిస్తున్న అల్లరోడు..
Naa Saami Ranga: కింగ్ నాగార్జున, అల్లరి నరేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా నరేష్ కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Naa Saami Ranga- Allari Naresh Intro Glimpse: టాలీవుడ్ లో హిట్స్, ఫ్లాప్స్ సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో కింగ్ నాగార్జున ఒకరు. ఘోస్ట్ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చిన నాగ్.. ఇప్పుడు నా సామిరంగ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మన్నథుడికి జోడిగా కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ ప్రోమో ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశాయి.
ఈ చిత్రంలో యంగ్ హీరో అల్లరి నరేష్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 14న అతడికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. తాజాగా నరేష్ కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో నరేష్.. అంజిగాడు అనే పక్కా పల్లెటూరి కుర్రాడి అవతారంలో కనిపిస్తున్నాడు. గ్లింప్స్ లో 'చేసేయ్ చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తది' అంటూ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. తొలిసారి నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు నరేష్. మరి ఈ మూవీ వీరిద్దరికీ ఎలాంటి బ్రేక్ ఇవ్వబోతుందో వేచి చూడాలి. ఈ చిత్రాన్ని నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
నా సామిరంగ మూవీ అస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పైగా నాగార్జున-కీరవాణి గారిది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలియికలో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి, రాజన్న వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి. చాలా కాలంగా నాగార్జునకు సరైన హిట్ లేదు. బంగార్రాజు తర్వాత ఇతడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. నా సామిరంగతోనైనా హిట్ కొట్టాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.
Also Read: Deepika Padukone: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి