Deepika Padukone: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, వీడియో వైరల్

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2023, 12:41 PM IST
Deepika Padukone: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, వీడియో వైరల్

Deepika Padukone Visit tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) దర్శించుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమల చేరుకున్న దీపికా.. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం నటికి రంగనాయకుల మండపంలో వేదపండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

గురువారం రాత్రి దీపికా అలిపిరి మెట్ల మార్గం గుండా గోవింద నామస్మరణ చేస్తూ.. సుమారు మూడున్నర గంటలపాటు నడిచి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. నడక మార్గంలో సడన్ గా ఆమెను చూసి షాకయ్యారు. దీపికాతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. పైకి చేరుకున్న దీపికాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రాత్రి రాధేయం అతిధి గృహంలో బసచేసిన దీపికా శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. హృతిక్ రోషన్, దీపికా జంటగా నటించిన ఫైటర్ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 

Also Read: Sreeleela Dance: 'ఓ మై బేబి సాంగ్‌'కు శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు, వైరల్ అవుతున్న వీడియో..

 శ్రీవారి సేవలో దగ్గుబాటి సురేష్, అభిరామ్
మరోవైపు టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్‌ బాబు కూడా కుటుంబం సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సురేశ్‌ దంపతులతోపాటు కొత్త జంట దగ్గుబాటి అభిరామ్‌ దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలోనే వీరు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఇటీవల దగ్గుబాటి అభిరామ్‌ పెళ్లి శ్రీలంకలో కుటుంబ సభ్యులు, సన్నిహతుల సమక్షంలో జరిగింది. ఇతడు నటించిన అహింస మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు తేజ.

Also read: Unstoppable With Nbk: బాలయ్య షోకు అలనాటి అందాల తారలు.. ప్రోమో మామూలుగా లేదు భయ్యా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News