Aparichithudu: విక్రమ్ కంటే ముందు తెలుగులో మరో అపరిచితుడు.. ఇంతకీ ఎవరో తెలుసా..
Aparichithudu: అవును శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘అన్నియన్’ సినిమాను తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో డబ్ చేసిన రిలీజ్ చేసారు. అయితే.. తెలుగులో అంతకు ముందు ఓ అపరిచితుడు సినిమా తెరకెక్కాల్సింది కానీ అది వర్కౌట్ కాలేదు.
Aparichithudu: శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అపరిచితుడు’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడే ఓ వ్యక్తిలోని విభిన్న కోణాలను ప్రేక్షకులకు అర్దమయ్యేలా తెరకెక్కించడంతో సక్సెస్ అయ్యాడు దర్శకుడు శంకర్. ఈ సినిమాలో విక్రమ్ రామానుజంగా, రెమోగా.. అపరిచితుడుగా మూడు విభిన్న పాత్రలను ఎంతో అలవోకగా చేసి మెప్పించాడు. ఒక మనిషిలో దాగున్న మరో మనిషిని ఎంతో నాచురల్ గా తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. అంతేకాదు శంకర్ రాసుకున్న స్క్రిప్ట్ కు విక్రమ్ 100కు 100 శాతం న్యాయం చేసాడు. ఈ సినిమా విడుదలైన దాదాపు 19 యేళ్లు కావొస్తోంది. కానీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్యూరియోసిరటీ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాకు తొలిసారి ఏఆర్ రెహమాన్ కు బదులు హరీష్ జై రాజ్ సంగీతం అందించారు. అంతేకాదు ఈ సినిమాలోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అంతేకాదు ఈ సినిమా భారతీయ చిత్ర సీమలో ఓ బ్లాక్ బస్టర్ క్లాసిక్ గా నిలిచింది.
ఈ సినిమా విడుదలైన 2 దశాబ్దాలు అవుతుంది. అంతేకాదు త్వరలో ఈ సినిమాను హిందీలో రణ్ వీర్ సింగ్ తో శంకర్ రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. భారతీయుడు 2, భారతీయుడు 3, గేమ్ ఛేంజర్ మూవీల తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ సంగతి పక్కన పెడితే.. విక్రమ్ ‘అపరిచితుడు’ సినిమా కంటే ముందు తెలుగులో మరో అపరిచితుడు సినిమా తెరకెక్కాల్సింది. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు.
90లలో శ్రీను వైట్ల.. రాజశేఖర్ తో అపరిచితుడు సినిమాను అనౌన్స్ చేసాడు. 1998లో రవితేజతో చేసిన ‘నీకోసం’ సినిమా కంటే ముందు 1994లో శ్రీను వైట్ల ... రాజశేఖర్ హీరోగా అపరిచితుడు టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ కారణంగా ఆ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత పదేళ్లకు 2005లో అపరిచితుడు సినిమా విడుదలై తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా అప్పట్లోనే ఈ సినిమా శంకర్ బ్రాండ్ నేమ్ తో ఈ సినిమా రూ. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫైనల్ రన్ లో తెలుగులో రూ. 14 కోట్ల షేర్ అందుకొని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా రీ రిలీజ్ లో ఈ సినిమా దాదాపు రూ. 34 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం. మరోవైపు శంకర్.. అపరిచితుడు సినిమాకు సీక్వెల్ ను రెడీ చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter