Breakup Day: ఇంకా నీకో దండం.. మోసాలు, అబద్ధాలతో ఏర్పడిన నీ ప్రేమ నాకొద్దు.. యాంటి వాలెంటైన్ డేలో చివరిరోజు..
Love: ప్రేమలో ఒకరిని మరోకరు ఎంతో అర్థం చేసుకుంటారు. ఎన్నో త్యాగాలు కూడా చేసే వారుంటారు. కానీ కొందరు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. కేవలం తమ వ్యక్తిగత అవసరాల కోసం ప్రేమలో ఉన్నట్లు నటిస్తుంటారు. తీరా అవసరాలు అయిపోయాక బ్రేకప్ చెప్పేస్తుంటారు.
Anti valentines week 2024: వాలెంటైన్స్ డేకు ఎగ్జాక్ట్ గా యాంటి వాలెంటైన్స్ వీక్ ను సెలబ్రేట్ చేస్తుంటారు. కొందరు ప్రేమలో, ఉండి తాము గెలిచి, తమ వాళ్లను గెలిపించుకంటే మరికొందరు పూర్తిగా కమర్షియల్ గా ఆలోచిస్తుంటారు. నాకేంటీ అన్న ధోరణిలో ఉంటారు. తమకు ప్రాఫిట్ ఉంటే ఎంత దూరమైన వెళ్తుంటారు. దేనికైన సిద్ధంగా ఉంటారు. ఇక అవసరాలను తీరిపోయాయి.. ఇక లాభంలేదనిపించగానే.. ఏదోరకంగా అవతలివారిని అవాయిడ్ చేస్తుంటారు.
Read More: Kaya Thapar: హాట్ ఫోజులతో కిరాక్ పుట్టిస్తోన్న కావ్య థాపర్.. ఇది మాములు డోసు కాదండోయ్..
ఇలా ప్రవర్తించడంలో కొందరు.. అబ్బాయిలు, అమ్మాయిలు సైతం ఒకరికి మరోకరు పోటీగా నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం యాంటి వాలెంటైన్స్ వీక్ ను భగ్న ప్రేమికులు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమిస్తున్నట్లు నటించి, మోసపోయిన వారు ఇలా చేస్తుంటారు. యాంటీ వాలెంటైన్స్ వీక్ లో.. స్లాప్ డే, కిక్ డే, పర్ఫూమ్ డే, ఫ్లర్టిండే, కాన్ఫేషన్ డే, మిస్సింగ్ డే, చివరిరోజున ఫిబ్రవరి 21 న యాంటీ వాలెంటైన్ డే రోజును బ్రేకప్ డేగా జరుపుకుంటారు.
ఈరోజు ఎవరైతే ఇన్ని రోజులు ప్రేమిస్తున్నట్లు నటించి, అవతలివారి ఎమోషన్స్ తో ఆడుకుంటారో అలాంటి వారిని వదిలించుకునేందుకు స్పెషల్ డేగా చెబుతుంటారు. ఇంకా లైఫ్ లో వారి మోహం ఎప్పుడు చూడకూడదంటారు. లైఫ్ లో కొన్ని టార్గెట్ లు పెట్టుకుని దాని కోసం కష్టపడాలని చెబుతుంటారు.
సాధారణంగా ప్రేమ అనేది ఒక గొప్ప బంధం. అది జీవితంలో ఒకరి మీద మాత్రమే కల్గుతుంది. లైఫ్ అంతా వారితోనే తమ జీవితాన్ని పంచుకొవాలని కోరుకుంటారు. ఒక వేళ మనకు ఆ బంధం దొరకున్న ఎవరితో ఉన్న ఆనంగా ఉండాలనుకుంటారు. దీని కోసం ఎంతటి త్యాగమైన చేయడానికి వెనుకాడరు.
Read More: Yashika Aannand: ఎద అందాలతో వల వేస్తున్న యాషిక ఆనంద్ .. హాట్ ఫిక్స్ వైరల్
కానీ ఈ రోజుల్లో యువత కేవలం..వయసులో కల్గే ఆకర్షణను ప్రేమ అనుకొని తప్పులు పనులు చేసి జీవితం కష్టాల్లో నెట్టుకొంటుకున్నారు. మరికొందరు తమకు దక్కని ప్రేమ లేదా అవతలి వారికి ఎవరికి కూడా దక్కకూడదని ఉన్మాదులుగా మారుతున్నారు. కానీ స్వచ్ఛమైన ప్రేమ పొందాలంటే... జీవితంలో ఏంతో కొంత లక్ ఉండాలని కూడా కొందరు చెబుతుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook