O Manchi Ghost Paisa Re Paisa డబ్బు ప్రాధాన్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డబ్బు లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు. ప్రపంచాన్ని నడిపిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కాదు డబ్బు.  ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే  పాయింట్‌తో ఇప్పుడు ఓ సాంగ్ వచ్చింది. ఓ మంచి ఘోస్ట్ (OMG) అనే సినిమా నుంచి విడుదలైన పైసా రే పైసా అంటూ సాగే ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ మంచి ఘోస్ట్ సినిమాలో  డబ్బు ప్రాముఖ్యతపై అద్భుతమైన, అంతే చమత్కారమైన పాటను రాసి పాడి అందరినీ అలరిస్తున్నాడు అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్‌తో పాటు శ్రీనివాస్ చింతల ఈ పాటను రచించాడు. మంచి బీట్‌తో ఉన్న ఈ సాంగ్‌కు బాబా భాస్కర్ కొరియోగ్రాఫీ మరింతగా కలిసి వచ్చింది. డబ్బు మన జీవితంలో ఎలాంటి పాత్ర  పోషిస్తుందో చెప్పే ఈ పాట నెట్టింట్లో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.


 



డబ్బు చుట్టు లోకం తిరుగుతుంది.. నీతో పట్టి చాకిరి చేస్తుంది అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంపై ఇప్పుడు మంచి బజ్ నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందించడంతో పాటు ఈ పాటకు సాహిత్యం అందించడం విశేషం. 


Also Read:  Sadha instead of indraja : ఇంద్రజ అవుట్ సదా ఇన్.. కొత్త జడ్జ్‌తో కళకళ


మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా. అభినికా ఐనాభాతుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో శ్రోతల్ని ఉర్రూతలూగిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన అప్డేట్ల గురించి ప్రకటించున్నట్టుగా మేకర్లు తెలిపారు. ఈ చిత్రంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందితా శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.


Also Read:  Mothers Day 2023 : మదర్స్ డే స్పెషల్.. సెలెబ్రిటీల తల్లులు వీళ్లే.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook