Anushka Shetty about Adipurush movie : ప్యాన్ ఇండియా చిత్రం అయిన 'ఆదిపురుష్'లో శ్రీరాముడిగా ప్రభాస్ ( Prabhas in Adipurush), రావణాసురునిగా సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan in Adipurush ) చేయనున్నట్లు ఆ చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఈ సినిమాలో కీలక పాత్రలైన సీత, హనుమంతుడు, లక్ష్మణుడి పాత్రలు ఎవరు చేయబోతున్నారు అనేదే ఇంకా తేలాల్సి ఉంది. ప్రభాస్ అభిమానులు ( Prabhas fans ) సైతం ఈ వివరాల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సరసన సీతగా ఎవరు చేయబోతున్నారు అనేదానిపైనే ప్రభాస్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాహుబలి సినిమాలో ప్రభాస్ సరసన నటించిన అనుష్క ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో ( Anushka as Sita in Adipurush ) చేయబోతోంది అని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై అనుష్క స్పందించింది. అనుష్కకి ఖాళీ సమయం దొరికినప్పుడు, తన గురించి సోషల్ మీడియాలో ఏం వార్తలు వస్తున్నాయొ చదువుతాను అని చెప్పింది. అలాగే ఈ మధ్య తను ఆదిపురుష్ సినిమాలో ( Adipurush movie ) చేస్తున్నట్లు, అది కూడా సీత పాత్రలో చేయబోతున్నట్లు వచ్చిన వార్తను గమనించిందంట. Also read : Payal Ghosh wants Y-category security: వై కేటగిరీ సెక్యురిటీ కావాలంటున్న పాయల్ ఘోష్


ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, అనుష్క ( Anushka Shetty ) ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఓం రావత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తాను చేయడం లేదు అని, ఈ సినిమా కోసం ఎవరూ తనని సంప్రదించలేదు అని క్లియర్‌గా చెప్పింది అనుష్క. కానీ ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఐతే మరోసారి ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్, అనుష్కలను తెరపై చూడాలనుకున్న వారికి ఆమె చెప్పిన సమాధానం నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం అనుష్క నటించిన 'నిశ్శబ్దం' సినిమా  ( Nishabdam movie ) ఓటిటిలో విడుదలకు సిద్ధంగా ఉంది. Also read : Mumaith Khan news: ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్‌ని చీట్ చేసిందా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe