Payal Ghosh wants Y-category security: వై కేటగిరీ సెక్యురిటీ కావాలంటున్న పాయల్ ఘోష్

Actress Payal Ghosh allegations on Anurag Kashyap: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణ పారదర్శకంగా లేదని.. ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra govt ) సుశాంత్ మృతికి కారకులైన బాలీవుడ్ ప్రముఖులకు కొమ్ము కాస్తోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ( Kangana Ranaut ) మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే.

Last Updated : Sep 30, 2020, 12:40 AM IST
Payal Ghosh wants Y-category security: వై కేటగిరీ సెక్యురిటీ కావాలంటున్న పాయల్ ఘోష్

Actress Payal Ghosh allegations on Anurag Kashyap: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణ పారదర్శకంగా లేదని.. ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra govt ) సుశాంత్ మృతికి కారకులైన బాలీవుడ్ ప్రముఖులకు కొమ్ము కాస్తోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ( Kangana Ranaut ) మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ముంబైలో తన కూతురికి ప్రాణ హానీ ఉందని.. ఆమెకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కోరుతూ కంగనా రనౌత్‌ తండ్రి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని వేడుకోవడం.. ఆ విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పంపించిన దరఖాస్తుని పరిశీలించి ఆమెకు కేంద్ర ప్రభుత్వం వై-కేటగిరీ భద్రత ( Y-category security ) కల్పించడం వంటి పరిణామాలన్ని అందరికీ తెలిసినవే. Also read : Mumaith Khan news: ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్‌ని చీట్ చేసిందా ?

ఇదిలావుండగా తాజాగా మరొక నటి ముంబైలో తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు వై-కేటగిరీ భద్రతను కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆమె ఎవరో కాదు.. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై ( Sexual harassment case against Anurag Kashyap ) లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సినీ నటి పాయల్ ఘోష్.

తెలుగులో మంచు మనోజ్‌తో కలిసి ‘ప్రయాణం’, ఎన్టీఆర్‌తో కలిసి ‘ఊసరవెల్లి’ వంటి చిత్రాలలో నటించిన పాయల్ ఘోష్ ( Payal Ghosh ).. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ ముంబైలోని ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. Also read : Drugs case: రకుల్ ప్రీత్ సింగ్ ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన NCB

ఐతే, అనురాగ్ కశ్యప్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీసుల తీరుపై అభ్యంతరాలు వ్యక్తంచేసిన పాయల్ ఘోష్.. తన ప్రాణానికి హాని ఉందని, వై-కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News