Anushka Shetty to Marry a Gold Businessman Based of Telangana: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోస్ లిస్ట్ తీస్తే అందులో మొదటి పేరు ప్రభాస్ కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ల లిస్ట్ తీస్తే అనుష్క పేరు ప్రథమ స్థానంలో కనిపిస్తుంది. వీరిద్దరికి వివాహం జరగబోతుందని గతంలో ఎన్నోసార్లు పుకార్లు తెరమీదకు వచ్చాయి. కానీ దాదాపు అనేక సందర్భాల్లో వీరు అలాంటిదేమీ లేదని ఖండిస్తూ వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజంగా వీరి మధ్య ఏమైనా ఉందో లేదో తెలియదు కానీ ఇద్దరి మధ్య సాన్నిహిత్య సంబంధాలు అయితే ఉంటాయి. ఇటీవల కృష్ణంరాజు మరణించిన సమయంలో కూడా అనుష్క హాస్పిటల్ కి వెళ్లి మరీ ఆయన పార్థివదేహాన్ని సందర్శించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అనుష్క తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో సరికొత్త వాదన తెర మీదకు వచ్చింది.  


తెలంగాణకు చెందిన ఒక గోల్డ్ బిజినెస్ చేసే వ్యాపారవేత్తతో ఆమె వివాహం నిశ్చయించినట్లుగా ప్రచారం జరుగుతోంది.. ప్రస్తుతానికి అనుష్క వయస్సు 40 కి దగ్గర పడింది. ఆమెకు ప్రస్తుతానికి చేతిలో సినిమాలు కూడా సరిగ్గా లేవు. ఈ నేపథ్యంలోనే ఆమె వివాహానికి సిద్ధమవుతున్నట్లు సరికొత్త ప్రచారం జరుగుతోంది. భూమిక భర్త భారత్ ఠాకూర్ దగ్గర యోగా నేర్చుకున్న అనుష్క తర్వాత యోగా ట్రైనర్ గా పని చేసేది. పూరీ జగన్నాథ్ కంట పడటంతో సూపర్ సినిమాతో హీరోయిన్ గా మారింది.


ఒకరకంగా టాలీవుడ్ సహా తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా చాన్నాళ్ల పాటు కొనసాగిన అనుష్క చివరగా నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆమె నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే బయటకు రాలేదు.


అయితే గతంలో కూడా అనుష్క పెళ్లి గురించి అనేక ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. కానీ ఆ తర్వాత అవేమీ నిజం కాలేదు. ఇప్పుడు ఆమె బంగారం వ్యాపారం చేసే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నదనే వార్త తెర మీదకు రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్త ఎంత వరకు నిజమవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి మరి. 
Also Read: God Father Pre Release Event : ఇద్దరు మెగాస్టార్ లు ఒకే ఈవెంట్లో.. ఇక రచ్చ రచ్చే!


Also Read: Chandrababu in Unstoppable: బాలకృష్ణ షోలో చంద్రబాబు.. అక్టోబర్ 4న విజయవాడలో ప్లానింగ్? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook