Salman Khan to attend God Father Pre Release Event at Ananthapuram: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన తెలుగు, హిందీ మలయాళ భాషలలో విడుదల కాబోతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు.
అలాగే వివేక్ ఒబెరాయ్ నటించిన పాత్రలో సత్యదేవ్, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార నటిస్తున్నారు. అలాగే సునీల్ సముద్రఖని, పూరీ జగన్నాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ చేశారు.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలోని అనంతపురంలో నిర్వహిస్తోంది సినిమా యూనిట్. వాస్తవానికి ముందు నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన జనసేన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా అమెరికా పర్యటనలో ఉండడంతో ఆయన ఈ వేడుకకు హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ సభా వేదిక వద్ద మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ తో పాటు సల్మాన్ ఖాన్ కటౌట్ కూడా పెట్టడంతో పాటు వాటికి డ్రోన్ల ద్వారా పూలాభిషేకం చేయిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా పిలుస్తున్నారేమో అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద మాత్రం అధికారికంగా సమాచారం అందాల్సి ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎనిమిది గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
Also Read: Indira Devi Death Live Updates: మహేష్ తల్లి మృతి.. మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు
Also Read: Saniya Iyappan Video: అక్కడ చేయి వేశాడని.. ఆకతాయి చెంప పగలగొట్టిన హీరోయిన్ (వీడియో)!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook