Chandrababu in Unstoppable: బాలకృష్ణ షోలో చంద్రబాబు.. అక్టోబర్ 4న విజయవాడలో ప్లానింగ్?

Chandrababu Naidu in Unstoppable with NBK Season 2: అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్బికె 2 ​లోని ఒక ఎపిసోడ్ లో చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 28, 2022, 06:18 PM IST
Chandrababu in Unstoppable: బాలకృష్ణ షోలో చంద్రబాబు.. అక్టోబర్ 4న విజయవాడలో ప్లానింగ్?

Chandrababu Naidu in Unstoppable with NBK Season 2: నందమూరి బాలకృష్ణ గత ఏడాది అఖండ సినిమాతో సూపర్ హిట్ అనుకోవడమే కాక మొట్టమొదటి పూర్తిస్థాయి తెలుగు ఓటీటీ ఆహా వీడియో కోసం అన్ స్టాప్ బుల్ విత్ ఎన్బికె అనే ఒక టాక్ షో కూడా చేశారు.  మొదటి సీజన్లో 10 ఎపిసోడ్లు ఉండగా 10 ఎపిసోడ్లు సూపర్ హిట్ గా నిలిచాయి. మోహన్ బాబు,  సుకుమార్,  అల్లు అర్జున్,  మహేష్ బాబు వంటి సెలబ్రిటీలతో నందమూరి బాలకృష్ణ మాట్లాడి వారి అంతరంగాలలోకి వెళ్లి మరీ వారి గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

దీంతో ఈ షో సూపర్ హిట్ గా నిలిచింది. సెకండ్ సీజన్ కూడా ఉంటుందని ఆహా టీం ప్రకటించింది. నిన్ననే దీనికి సంబంధించిన ఒక యాంధమ్  కూడా విడుదల చేసింది సినిమా యూనిట్. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు హైదరాబాదులోని సారథి స్టూడియోస్ లో ఈ అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్బికె 2 ప్రోమో షూట్ చేయడం కోసం ఒక సెట్ కూడా నిర్మించినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఎన్బీకే షూటింగ్ నిమిత్తం టర్కీ వెళ్లారు. టర్కీ నుంచి షూటింగ్ పూర్తి చేసిన కూడా ఆయన ఇస్తాంబుల్- దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన వీలైనంత త్వరగా ఈ ప్రోమో షూట్ పూర్తి చేస్తారని అంటున్నారు.  అక్టోబర్ 4వ తేదీన ఈ సెకండ్ సీజన్ కు సంబంధించిన కర్టెన్ రైజర్ ఒకటి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆ కర్డెన్ రైజర్ భిన్నంగా హైదరాబాద్ లో కాకుండా విజయవాడ ప్రాంతంలో ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది.

మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ ని మరింత గ్రాండ్ సక్సెస్ గా చేయడానికి సెకండ్ సీజన్లో మెగాస్టార్ చిరంజీవి,  అనుష్క శెట్టి,  వంటి వారిని హీరోలను తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒక ఎపిసోడ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.   అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. 

Also Read: God Father Pre Release Event : ఇద్దరు మెగాస్టార్ లు ఒకే ఈవెంట్లో.. ఇక రచ్చ రచ్చే!
Also Read: Sreenath Bhasi Arrested: విశ్వక్ సేన్ లాగే ఎఫ్-వర్డ్ వాడిన మలయాళ హీరో అరెస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News