Manchu Vishnu Jinnah movie title controversy: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'జిన్నా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మంచు విష్ణు తన సినిమాకు జిన్నా అనే టైటిల్‌ను వెంటనే తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.  టైటిల్‌ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడాన్ని కూడా బీజేపీ తప్పుబట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'జిన్నా' టైటిల్‌పై తీవ్ర అభ్యంతరం చెబుతూ హీరో మంచు విష్ణుకు బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి ఓ ట్వీట్‌ చేశారు. 'జిన్నా పేరుతో సినిమా టైటిల్‌ను మంచు విష్ణు వెంటనే ఉపసంహరించుకోవాలి. జిన్నా సినిమా టైటిల్ లోగోను తిరుమల ఏడుకొండల మధ్య ఉంచడమేంటి. మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడు. జిన్నా వల్ల హిందువులు ప్రాణాలు, మానాలు కోల్పోయారు. దేశభక్తి కల వారు ఎవరూ దీనిని హర్షించరు' అని విష్ణువర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. 


సినిమా టైటిల్‌కి, మహమ్మద్‌ ఆలీ జిన్నాకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రముఖ రైటర్‌ కోన వెంకట్‌ అంటున్నారు. ఇది జీ  నాగేశ్వరరావు అనే తిరుపతిలో పెరిగిన కుర్రాడి కథ అని, జీ నాగేశ్వరరావు అనే పేరు నచ్చక దాని చిన్నదిగా చేసి జిన్నాగా మార్చుకుంటాడని.. దాన్నే మేము టైటిల్‌గా పెట్టామని కోన చెబుతున్నారు. ఏదేమైనా ఈ వివాదంపై ప్రొడ్యూసర్‌తో మాట్లాడతానని ఆయన చెప్పారు. జిన్నా టైటిల్‌కు అలియాస్‌ జీ నాగేశ్వరరావు అని జతచేస్తామని కోన చెప్పుకొచ్చారు.


ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో జిన్నా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మంచు విష్ణు సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్‌ రూబెన్స్‌ సమకూర్చుతున్నారు. ఇటీవలే జిన్నా షూటింగ్ ప్రారంభం అయింది. షూటింగ్ సమయంలో సన్నీతో విష్ణు ఫన్నీ వీడియో చేసిన విషయం తెలిసిందే. 


Also Read: Anushka Sharma Pregnant: చెకప్ కోసం హాస్పిటల్‌కు.. అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా?  


Also Read: Vikram Collections: బాక్సాఫీస్‌పై విక్ర‌మ్ దండ‌యాత్ర‌.. 10 రోజుల్లోనే 300 కోట్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook