Anushka Sharma Pregnant: చెకప్ కోసం హాస్పిటల్‌కు.. అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా?

Is Virat Kohli wife Anushka Sharma Second Time Pregnancy. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కారులో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ ఫోటోగ్రాఫర్ వీడియో తీశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2022, 01:09 PM IST
  • వెకేషన్ కోసం మాల్దీవులకు
  • చెకప్ కోసం హాస్పిటల్‌కు అనుష్క
  • అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా
Anushka Sharma Pregnant: చెకప్ కోసం హాస్పిటల్‌కు.. అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా?

Is Anushka Sharma Second Time Pregnant After Vamika: ప్రస్తుతం సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. వరుసగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. దాంతో సతీమణి అనుష్క శర్మ, కూతురు వామికాతో కలిసి అతడు వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్ళాడు. అక్కడ చాలా రోజులు ఎంజాయ్ చేసిన కోహ్లీ దంపతులు సోమవారం (జూన్ 13)న తిరిగి వచ్చారు. ముంబైలోని విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం విరుష్క జోడి కనిపించింది. విమానాశ్రయం నుంచి బయటికి వచ్చాక కెమెరాకు పోజులిచ్చారు. 

అయితే వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన కొద్ది గంటల్లోనే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ హాస్పిటల్‌కు వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సోమవారం సాయంత్రం ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ వద్ద విరుష్క జోడి కన్పించారు. వీరిద్దరూ కారులో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ ఫోటోగ్రాఫర్ వీడియో తీశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు ఊరుకుంటారా?.. 'అనుష్క శర్మ మళ్లీ ప్రెగ్నెంట్'. 'అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరి అనుష్క శర్మ మళ్లీ ప్రెగ్నెంటా? కాదా? అన్న విషయం కాస్త ఆలస్యమైనా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే.. అనుష్క తన విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు కాబట్టి. ఏదేమైనా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తాము హాస్పిటల్‌కు వెళ్లిన రీజన్ గురించి మాత్రం వెల్లడించలేదు. ఓ షాంపూ యాడ్ కోసం కలిసిన కోహ్లీ, అనుష్క.. ప్రేమలో పడి వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వీరికి 2021 జనవరిలో వామికా జన్మించింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరు. 2008లో వచ్చిన 'రబ్ నే బనాది జోడీ' సినిమాతో సినీ ప్రేక్షకులకు అనుష్క పరిచయం అయ్యారు. ఆ సినిమా భారీ హిట్ కొట్టడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే అమీర్ ఖాన్, షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్‌తో కలిసి సినిమాలు చేశారు. బద్మాష్ కంపెనీ, బ్యాండ్ బాజా భారత్, పీకే, బాంబే వెల్వెట్, సుల్తాన్, పారి, సంజు, జీరో లాంటి హిట్ సినిమాల్లో అనుష్క నటించారు.  ఆపై పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. 

Also Read: IND vs SA Dream11 Prediction: అక్షర్, చహల్, అవేశ్ అవుట్.. టీమిండియా తుది జట్టు ఇదే! డ్రీమ్ ఎలెవన్ టీమ్.. 

Aslo Read: BJP Leaders Arrest: బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్ట్... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News