Aparna Das Deepak Parambol Marriage: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్  ప్రేమ వివాహాలు చేసుకోవడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ కోవలో మరో జంట చేరింది.  తాజాగా మలయాళీ నటి అపర్ణా దాస్, తన తోటి నటుడు మంజుమ్మేల్ బాయ్స్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న దీపక్ పరంబోల్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది. ఈ రోజు  కేరళలోని పడకంచేరిలో వీరి పెళ్లి జరిగింది.
ఇక అపర్ణా దాస్ విషయానికొస్తే.. 2018లో నిజం ప్రకాషన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. 'మనోహరం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ సినిమాలో తన తోటి నటుడు దీపక్ పరంబోల్‌తో కలిసి నటించింది. ఆ సినిమాలో మొదలైన ప్రేమ.. తాజాగా  పెళ్లితో ఎండ్ కార్డ్ వేసారు. వీరి పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ సందర్బంగా వీళ్లిద్దరు దండలు మార్చుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అపర్ణా దాస్ విషయానికొస్తే.. తెలుగులో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నటించిన 'ఆదికేశవ' మూవీలో హీరో సిస్టర్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'బీస్ట్‌'లో అపర్ణా దాస్ కీ రోల్ ప్లే చేసింది. ఒమన్‌లో పుట్టి పెరిగిన అపర్ణా దాస్..  తన తోటి నటుడు మంజుమ్మేల్‌ బాయ్ ఫేమ్ దీపక్ పరంబోల్‌తో గత కొన్నేళ్లుగా గాఢ ప్రేమలో ఉంది. వీరి  పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరు ఒకింటి వారయ్యారు.
ప్రస్తుతం ఈమె వయసు 28 యేళ్లు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని ఒకింటి ఆమె అయింది.


Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook