Aryan Khan’s bail plea hearing live updates: ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌కు కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. ఆర్యన్ ఖాన్ మూడోసారి దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ విషయంలో సైతం కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నేడు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ముంబై కోర్టు.. తమ తీర్పును ఈనెల 20కి రిజర్వ్ చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఈ నెల 20వ తేదీ వరకు జైలులోనే గడపక తప్పని పరిస్థితి ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనెల 2న ముంబై క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ అతని స్నేహితులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఆర్యన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ ఇప్పించడం కోసం షారుఖ్ ఖాన్ తరుపు లాయర్లు ముంబై కోర్టులో తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు.


ఇదిలావుంటే, ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ఎన్సీబీ బలంగా వాదిస్తోంది. ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్ (Aryan Khan drugs case) తీసుకుంటున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని.. అందుకే ఆర్యన్ ఖాన్‌తో పాటు అతడితో అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్ ఇవ్వకూడదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కోర్టుకు విజ్ఞప్తిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కోర్టు సైతం ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ మంజూరు (Aryan Khan bail plea hearing) విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవడం లేదు. 


Also read : MAA Elections- Prakash Raj letter : సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ లేఖ


మరోవైపు ఆర్యన్ ఖాన్‌కి కొవిడ్ పరీక్షల్లో నెగటివ్ అని తేలడంతో ఆర్థర్ జైల్లో అతడిని కామన్ సెల్‌కి (Aryan Khan in jail) తరలించినట్టు ఆర్థర్ జైల్ సూపరింటెండెంట్ మీడియాకు తెలిపారు.


Also read : Manchi Rojulochaie Trailer: ‘మంచి రోజులోచ్చాయి’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌


Also read : 14 Movie Teaser: 14 మూవీ టీజర్.. ఒక అమ్మాయి.. అబ్బాయి కోసం రావాలంటే.. ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook