Ashika Ranganath: ఆషిక రంగనాథ్…ఈ హీరోయిన్ లేకుంటే నా సామిరంగా పరిస్థితి ఏమిటి!!
Naa Saami Ranga Story: సంక్రాంతి అంటేనే సినీ ప్రేక్షకులకు పండుగ. వరస పెట్టి మరి ఈ పండుగకి సినిమాలను విడుదల చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు హీరోలు, నిర్మాతలు. ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి దాదాపు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒక చిత్రం నాగార్జున హీరోగా చేసిన నా సామి రంగా…
Naa Saami Ranga Collections: గ్లామర్ కింగ్.. గ్రీకువీరుడు.. మన్మధుడు..ఎవర్ గ్రీన్ హీరో.. అంటే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు నాగార్జున. ఒకప్పుడు హీరోయిన్స్ ని సైతం నాగార్జున అందం డామినేట్ చేసేది. నాగార్జున పక్కనే ఉంటే హీరోయిన్స్ కూడా చాలామంది కళ్ళకు అనేవాళ్ళు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం అది పూర్తిగా మారింది. గత కొద్ది చిత్రాల నుంచి నాగార్జున వయస్సు బాగా తెలుస్తోంది. దానికి తోడు నాగార్జున తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేయకపోవడంతో.. అది ఆయన లుక్స్ పైన అలానే సినిమాల పైన తీవ్ర ప్రభావం చూపిస్తూ వస్తోంది. దానికి తగ్గట్టే ఈమధ్య విడుదలైన నాగార్జున సినిమాలు అన్ని డిజాస్టర్లుగా మిగిలాయి.
ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ బాగా కలిసి వచ్చే నాగార్జున ఈ సంక్రాంతికి నా సామిరంగా అంటూ మన ముందుకి వచ్చారు. అయితే ఈ చిత్రంలోని విశేషాం ఏమిటి అంటే.. ఈ సినిమాలో నాగార్జునని పూర్తిగా డామినేట్ చేసి పడేసింది హీరోయిన్ ఆషికా.
ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పుడు ఈ సినిమాపై ఎవరికి అంచనాలు లేవు. కానీ టీజర్ విడుదలైన దగ్గర నుంచి మాత్రం ఈ చిత్రం పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. దానికి ముఖ్య కారణం ఈ సినిమా హీరోయిన్ ఆషికా రంగనాథ్. కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో మనకు పరిచయమైంది ఈ హీరోయిన్. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ఆ చిత్రంలో ‘ఎన్నో రాత్రులు వస్తాయి గాని’ అనే పాట బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ పాటలో మెరిసిన కానీ.. ఆషికా కి ఆ చిత్రంతో ఆశించినంత పేరు మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు నా సామిరంగా చిత్రంతో మాత్రం అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.
టీజర్.. ట్రైలర్ లోనే తన నటనతో బాగా ఆకట్టుకుంది ఆషికా. ఇక అదే కంటిన్యూ అవుతూ.. సినిమాలో కూడా తన క్యారెక్టర్ సినిమాకే పెద్ద పాజిటివ్ గా నిలిచింది.
అసలు చెప్పాలి అంటే ఈ చిత్రంలో ఆషికా క్యారెక్టర్.. నటన తప్పి …ఒక్కటంటే ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేదు. కథ మొత్తం దాదాపు ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఆషిక ఎక్కువసేపు ఉంటుంది కాబట్టే ఈ సినిమాలో ప్రధమార్ధం కొంచమైనా బోర్ కొట్టకుండా సాగిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో ఆషిక కొంచెం తక్కువ కనిపించడంతో…ఏందిరా బాబు ఈ చిత్రం అని ద్వితీయార్థం మనకు అనిపించక మానదు.
సెకండ్ హాఫ్ లో కూడా ఆషిక కనిపించే సీన్లు మాత్రమే ఈ చిత్రానికి పాసిటివ్ గా నిలిచాయి. నిజానికి ఈ సినిమాలో ఆషికా లేకుంటే కనీసం రెండు రోజులు కూడా థియేటర్స్ లో హౌస్ ఫుల్ అయ్యుండదేమో. కథ విషయానికి వస్తే పరమ రోటిన్ కథ. ‘హీరోయిన్ పై విలన్ మోజు.. దానికి హీరో కోపం రైస్’. సింపుల్ గా చెప్పాలి అంటే రాముడు.. సీత.. రావణుడు క్యారెక్టర్లతో పోలుస్తూ మన తెలుగులో ఎప్పటినుంచో వస్తున్న సర్వసాధారణమైన కథ. ఒక పాత్ర పెంచడం కోసం అల్లరి నరేష్ ని అంజిగా పెట్టారు. ఇక కథ మొత్తం షరా మామూలే.. హీరోయిన్ ని ఎత్తుకుపోవడానికి విలన్ ట్రై చేయగా.. అంజి క్యారెక్టర్ అడ్డుపడుతుంది.. ఇక అంజి క్యారెక్టర్ ని చంపేయగా ఆ పగతో రగిలిపోయి హీరో క్యారెక్టర్ విలన్ ని చంపేస్తుంది. ఈ సింగల్ లైన్ కథని రెండున్నర గంట సేపు చూపించారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా పర్వాలేదు అనిపించుకోవడం.
నాగార్జున లెక్కలు సినిమాల విషయంలో ఎప్పుడూ కరెక్టుగా ఉంటాయి అంటారు చాలామంది. నా సామిరంగా సినిమా చూస్తే కరెక్టే అనిపిస్తోంది. కనీస కథ.. మినిమం క్వాలిటీ టేకింగ్ కూడా లేని ఈ చిత్రం విజయం సాధించింది అంటే.. దానికి కారణం నాగార్జున తీసుకున్న రెండు నిర్ణయాలే. వాటిల్లో ఒకటి ఆషికా ని హీరోయిన్ గా తీసుకోవడం మరొకటి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడం.
Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter