Ashish Vidyarthi: నాకు ఆఫర్స్ ఇవ్వండి.. నేను బతికే ఉన్నానంటూ.. పోకిరి విలన్ ఆశిష్ విద్యార్ధి సంచలన కామెంట్స్..
Ashish Vidyarthi: పోకిరి సినిమా చూసినవాళ్లకు అందులో క్రూరమైన పోలీస్ పాత్రలో నటించిన ఆశిష్ విద్యార్ధి పాత్రను ఎవరు మరిచిపోలేరు. ఈ సినిమాలో కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించేసాడు. తెలుగులో ఎన్నో విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించిన ఈ నటుడు ప్రస్తుతం సరైన ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్నాడట. అందుకే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను బతికే ఉన్నాను.. తనకు సినిమాలు ఛాన్సులు ఇవ్వండి ప్లీజ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Ashish Vidyarthi: ఆశిష్ విద్యార్ధి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర ఏదైనా అందులో లీనమై జీవించేస్తాడు. ముఖ్యంగా క్రూరమైన విలన్ పాత్రలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈయనే. ఆయా పాత్రల్లో తనదైన నటనతో ప్రాణం పోస్తారు. ముఖ్యంగా హిందీ సహా దక్షిణాది సినిమాల్లో క్రూరమైన కన్నింగ్ విలనీ పాత్రలంటే ఆశిష్ విద్యార్ధి గుర్తుకు వస్తారు. ఇక ఈయన తెలుగులో ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'పోకిరి'లో క్రూయల్ విలనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈయన యాక్టింగ్‌ను ఎవరు మరిచిపోలేదు. ఈయన విలనిజంతోనే పోకిరి సినిమాలో మహేష్ బాబు హీరోయిజం బాగా ఎలివేట్ అయింది.
ఆ తర్వాత తెలుగులో ఈయన ఎన్నో చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈయనకు సినిమాల్లో సరైన అవకాశాలు రావడం లేదు. ఈయన తెలుగులో చివరగా 'రైటర్ పద్మభూషణ్' సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఈయన రేంజ్‌కు తగ్గ పాత్రలు మాత్రం రావడం లేదు. అటు వెంకటేష్, రానా హీరోలుగా నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌లో కూడా ఈయన పాత్రకు మంచి ప్రశంసలే దక్కాయి.
ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశిష్ విద్యార్ధి మాట్లాడుతూ.. తాను బతికే ఉన్నానని.. తనకు సినిమా ఆఫర్స్ ఇవ్వండి అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రొటీన్ పాత్రలు కాకుండా డిఫరెంట్ పాత్రలు ఇస్తే చేస్తానని చెబుతున్నాడు ఈ నటుడు. ఆశిష్ విద్యార్ధి 'కాల్ సంధ్య' అనే హిందీ సినిమాతో నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. ఆ తర్వాత గోవింద్ నిహ్లాని దర్శకత్వంలో తెరకెక్కిన 'ద్రోహ్ కాల్' సినిమాలో నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడి అవార్డు అందుకున్నారు. ఈయన హిందీ, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళం కలిపి దాదాపు 11 భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటుడిగా సత్తా చాటాడు. ఆశిష్ విద్యార్ధి అంటే క్రూరమైన విలనీకి పెట్టింది పేరు. ఈయన తెలుగులో 'పాపే నా ప్రాణం' సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'శ్రీరామ్' విజయేంద్ర వర్మ, గుడుంబా శంకర్, ఛత్రపతి, అతనొక్కడే, నరసింహుడు, పోకిరి వంటి సినిమాల్లో నటించాడు. ఇక పోకిరి సినిమా ఈయనకు విలన్‌గా తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఈయన తెలుగులో వెనుదిరిగి చూసుకోలేదు.
అరవై ఏళ్లు దాటిన ఆశిష్ విద్యార్ధి ఇటీవలె అస్సాంకు చెందిన రూపాలి అనే ఫ్యాషన్ డిజైనర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ మ్యారేజ్‌తో ఈయన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ప్రస్తుతం తెలుగు సహా వివిధ భాషల్లో సరైన అవకాశాలు లేని ఈయన నటుడు అడపాదడపా ఒకటి అర చిత్రాల్లో నటిస్తున్నారు.
Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook