Ashish Vidyarthi Second Marriage: టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్, కోలీవుడ్‌లో విలన్ పాత్రలో పేరు సంపాదించిన స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నాడు. 60 ఏళ్ల వయసులో మరోసారి ఈ సీనియర్ నటుడు పెళ్లి పీటలు ఎక్కడం విశేషం. గురువారం అస్సాంకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రూపాలీ బారువాను వివాహం చేసుకున్నాడు. అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వివాహం జరిగింది. త్వరలో భారీ రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ పార్టీకి బంధువులు, స్నేహితులు అందరికీ ఆహ్వానం అందించనున్నాడు. ప్రస్తుతం ఆశిష్ విద్యార్థి పెళ్లి ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆశిష్ విద్యార్థి-రూపాలి బారుహ్‌ వివాహం కోల్‌కతాలో జరిగింది. ప్రస్తుతం రూపాలి కోల్‌కతాలో ఉండడంతో అక్కడే పెళ్లి చేసుకున్నాడు. ఈ దశలో వివాహం చేసుకోవడం అనేది ఒక అసాధారణమైన అనుభూతిగా అనిపిస్తోందని అన్నాడు ఆశిష్‌ విద్యార్థి. తన లవ్ స్టోరీ గురించి చెబుతూ ఇది పెద్ద స్టోరీ అని.. దాని గురించి మళ్లీ మాట్లాడుతానని చెప్పాడు. తాము కొంతకాలం క్రితం కలుసుకున్నామమని.. తమ సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని పెళ్లి కూతురు రూపాలి బారుహ్ తెలిపారు. 


ఆశిష్‌ విద్యార్థి 1962లో జన్మించాడు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా వివిధ భాషల్లో సినిమాల్లో నటించాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, ఒడియా, బెంగాలీ తదితర 11 భాషల్లో యాక్ట్ చేశాడు. 300కుపైగా చిత్రాల్లో ఆశిష్ విద్యార్థి నటించాడు. 1995లో ద్రోహ్‌కాల్ మూవీకి జాతీయా అవార్డు అందుకున్నాడు. తెలుగులో పోకిరి సినిమా ఆశిష్‌ విద్యార్థికి భారీ క్రేజ్ తీసుకువచ్చింది. గుడుంబా శంకర్, అతిథి, తులసి, లక్ష్యం, అలా మొదలైంది, నాన్నకు ప్రేమతో.., జనతా గ్యారేజ్, ఇస్మార్ట్ శంకర్ తదితర తెలుగు సినిమాల్లో అనేక సినిమాల్లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇటీవల కాస్త సినిమాలను తగ్గించిన ఆశిష్‌ విద్యార్థి.. తన యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. 


Also Read: Group-1 and Group-2 Notification: గ్రూప్‌-1, 2 ఉద్యోగార్ధులకు శుభవార్త.. అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల  


Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి