Hidimba Movie: కౌంట్ డౌన్ స్టార్ట్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి `హిడింబ`.. ఎక్కడ చూడొచ్చంటే?
Hidimba Movie: యంగ్ హీరో అశ్విన్ బాబు, నందిత శ్వేత లీడ్ రోల్స్ లో చేసిన చిత్రం `హిడింబ`. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇవాళ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎన్ని గంటలకు, ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోండి.
Hidimba OTT: అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం 'హిడింబ'(Hidimba Movie). ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీకి అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. జూలై 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌కు కాస్త పీరియాడికల్ టచ్ ఇచ్చి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అశ్విన్, నందిత శ్వేత పోలీస్ అధికారులుగా నటించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఈరోజు అంటే ఆగస్టు 10 సాయంత్రం 07 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు ఆహా ఓటీటీ మేకర్స్ ‘మాస్క్ వెనకున్న మనిషి ఎవరు’ అంటూ ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ తదితరులు కీ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి వికాస్ బాడిస సంగీతం అందించారు. హైదరాబాద్ లో కిడ్నాప్ కు గురైన మహిళల మిస్టరీని ఛేదించే పోలీసు ఆఫీసర్లుగా నందితా శ్వేత, అశ్విన్ బాబు కనిపిస్తారు. ఇన్వెస్టిగేషన్‌లో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ కిడ్నాప్ మిస్టరీని వారు ఛేదించారా లేదా అనేది తెలుసుకోవాలంటే హిడింబ సినిమాను చూడాల్సిందే. థియేటర్లలో మిస్ అయిన వారు ఎంచెక్కా ఈరోజు ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: Vijay Deverakonda Speech : రాసిపెట్టుకోండి హిట్టు పక్కా.. ఖుషీ ఈవెంట్లో ఖుషీఖుషీగా విజయ్ దేవరకొండ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook