Ashwini Dutt Condemns Amitabh Bachchan Injury: ఈ రోజు ఉదయం అమితా బచ్చన్ ప్రాజెక్టు కే సినిమా షూటింగ్లో గాయపడినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన సోషల్ మీడియా బ్లాగ్ లో పేర్కొనడంతో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారి పోయింది. ఆయనకు తీవ్ర గాయాలు అవ్వడం హాస్పిటల్ అని చికిత్స తీసుకున్నారని కూడా స్వయంగా పేర్కొన్న వ్యవహారం అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాజెక్టు కే సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలోనే తాను గాయపడ్డాను అని పేర్కొనడంతో ఆయన అభిమానులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కే సినిమాని ప్రస్తుతం ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మాణంలో ఆయన అల్లుడు ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలు తెరకెక్కించిన నాగశ్విన్ ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతుంది.


అయితే ఈ విషయం మీద ఇప్పుడు తాజాగా అశ్వినీ దత్ స్పందించారు. ఒక ప్రముఖ మీడియా హౌస్ ఆయనను సంప్రదించే ప్రయత్నం చేయగా అమితాబచ్చన్ కి ఈ ప్రాజెక్టు కే షూటింగ్ సందర్భంగా ఎలాంటి ప్రమాదం జరగలేదని అశ్వినీ దత్ పేర్కొన్నారు. మా షూటింగ్ లో అమితాబ్ సార్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని మూడు రోజులు క్రితమే ఆయన షూటింగ్ పూర్తి చేసుకుని బొంబాయి వెళ్ళిపోయారు అని అశ్వినీ దత్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.


అయితే మరి నిన్న ఈ విషయాన్ని అమితాబచ్చన్ ఎందుకు వెల్లడించారు? ప్రాజెక్టు కే సినిమా షూటింగ్లో అదికూడా హైదరాబాదులో ఉండగా తాను గాయపడ్డాడని ఎందుకు వెల్లడించారు అనే విషయం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. అమితాబచ్చన్ ఎందుకిలా పేర్కొన్నారు? అసలు నిజంగా ఏం జరిగింది? ఆయన నిజంగానే గాయపడ్డారా? ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? నిజంగానే ఊపిరి తీసుకుంటుంటే అలాగే కదులుతుంటే ఆయన ఇబ్బంది పడుతున్నారా? అనే విషయాలు మీద క్లారిటీ లేదు. ఈ విషయం మీద అమితాబచ్చన్ మరోసారి క్లారిటీ ఇస్తే తప్ప ఈ సందిగ్ధత క్లియర్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.
Also Read: Supritha Pulsar Bike Song: అది వేసుకోవడం మరిచిపోయా... సురేఖా వాణి కూతురి కామెంట్స్ వైరల్


Also Read: Nandini Reddy Says Sorry: కేజీఎఫ్ హీరోపై నీచ్ కమీన్ కుత్తే కామెంట్స్.. నందినీ రెడ్డి క్షమాపణలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి