Supritha Pulsar Bike Song: అది వేసుకోవడం మరిచిపోయా... సురేఖా వాణి కూతురి కామెంట్స్ వైరల్

Supritha forgot to Wear Tummy Tucker:  తాజాగా పల్సర్ బైకు పాటకి తాజాగా డాన్సులు వేసిన సుప్రీత తాను టమ్మీ టక్కర్ వేసుకోవడం మర్చిపో అంటూ కామెంట్ చేసింది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 6, 2023, 01:06 PM IST
Supritha Pulsar Bike Song: అది వేసుకోవడం మరిచిపోయా... సురేఖా వాణి కూతురి కామెంట్స్ వైరల్

Supritha Dance to Pulsar Bike Song: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి కూడా మంచి ఫాలోయింగ్ లభిస్తోంది. అందంగా ఉండి డాన్స్ లు బాగా చేయగలిగిన వాళ్లకి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ వస్తున్నారు. అందంగా లేకపోయినా వింత కంటెంట్ చేస్తున్నా  సరే వారిని ఆదరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే సురేఖా వాణి కుమార్తె సుప్రీత కూడా చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఎప్పటికప్పుడు తన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. తన తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని కూడా సోషల్ మీడియాలోకి తీసుకువచ్చి ఇద్దరూ కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి అందరూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ భామ సూపర్ హిట్ గా నిలిచిన ధమాకా సినిమాలోని పల్సర్ బైక్ సాంగ్ కి డాన్స్ చేసింది. వాస్తవానికి పల్సర్ బైక్ సాంగ్ అనేది శ్రీకాకుళానికి చెందిన రమణా అనే సింగర్ సృష్టించాడు. దాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడిన తర్వాత మంచి క్రేజీ లభించింది.

తర్వాత ధమాకా సినిమా యూనిట్ డబ్బులు చెల్లించి సినిమాలో వాడుకుంది. అయితే ఈ పాటకి తాజాగా డాన్సులు వేసిన సుప్రీత తాను టమ్మీ టక్కర్ వేసుకోవడం మర్చిపో అంటూ కామెంట్ చేసింది.  ఈ టమ్మీ టక్కర్ అంటే ఏమిటంటే ఈరోజుల్లో అందరికీ పొట్ట సమస్య వేధిస్తోంది. అందరూ తినేది జంక్ ఫుడ్ కావడంతో ఉన్న బాడీకి అదనంగా పొట్ట బయటికి తన్నుకొస్తోంది. దీంతో గ్లామర్ ఫీల్డ్ లో వాళ్లంతా ఈ టమ్మీ టక్కర్ వాడుతున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

ఇది ఈ పొట్టని లోపలికి పట్టి ఉంచి సాధారణంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఈ నేపద్యంలో అది ఆమె వేసుకోవడం మరిచిపోవడంతో పొట్ట బయటకు వచ్చి కనిపిస్తోంది. అయినా సరే వీడియో షేర్ చేసిన ఈ భామ టమ్మీ టక్కర్ వేసుకోవడం మరిచిపోయా అంటూ కామెంట్ చేసింది. అయితే తెలివిగా ఈ రీల్ షేర్ చేసిన తర్వాత రీల్ కి కామెంట్ ఆప్షన్ తీసేసింది. కామెంట్ ఆప్షన్ ఇచ్చుంటే రకరకాల కామెంట్లు ఆమను వేధించి ఉండేవి కానీ ఆ కామెంట్ ఆప్షన్ ఆఫ్ చేయడంతో అందరూ పాటను చూసి నవ్వుకుంటున్నారు .

Also Read: Venkatesh Maha on KGF2: ఆడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడైనా ఉంటాడా?.. కేజీఎఫ్2పై కంచరపాలెం డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

Also Read: Amitabh Bachchan Injured: ప్రభాస్ సినిమా షూటింగ్లో అమితాబ్ కు తీవ్ర గాయాలు.. ఊపిరి కూడా తీసుకోలేని విధంగా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 
 

Trending News