Venu Swamy Astrology On Naga Chaitanya: జ్యోతిష్యం అంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందో ముందే ఊహించి చెప్పడం. అలాగా సినీ, రాజకీయ, క్రీడలకు సంబంధించి పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో జ్యోతిష్యం చెప్పి సంచలనాలకు మారుపేరుగా నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సంచలన ప్రకటన చేశాడు. నిశ్చితార్థం చేసుకున్న కొత్త జంట అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ వివాహ జీవితం ఎలా ఉంటుందో ప్రకటన చేయనున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు. దీంతో మరోసారి వేణు స్వామి పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..


సినీ నటి సమంతతో విడాకులైన కొన్ని సంవత్సరాల అనంతరం సినీ నటుడు నాగచైతన్య మళ్లీ వివాహం చేసుకోబోతున్నాడు. హీరోయిన్‌ శోభిత ధూళిపాళతో కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నాడని వార్తలు వచ్చాయి. కాకపోతే వారిద్దరూ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఈ వార్తలు ప్రచారమవుతున్న సమయంలో గురువారం వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అయితే వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందోనని తాను చెబుతానంటూ వేణుస్వామి ప్రకటన చేసి సంచలనం రేపారు. దీంతో చై,శోభితల నిశ్చితార్థంతోపాటు వేణుస్వామి జ్యోతిష్యం ఎలా ఉంటోందనని ఆసక్తికర చర్చ మొదలైంది.

Also Read: Naga Chaitanya Sobhita Dhulipala: నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్..!!


ఏం చెప్పబోతున్నాడు?
నిశ్చితార్థం జరిగిన రోజే వేణు స్వామి తన వాట్సప్‌ స్టేటస్‌లో ఓ ప్రకటన చేశారు. 'నాగచైతన్య, శోభిత దూళిపాల వైవాహిక జీవితంపై సంచలనాత్మకమైన జాతకరపరమైన విశ్లేషణ రేపు' అంటూ వాట్సప్‌ స్టేటస్‌ పెట్టుకున్నారు. దీంతో ఆయన విశ్లేషణ ఎలా ఉంటుందోనని ఉత్కంఠ ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో వేణుస్వామి ప్రకటనపై విస్తృత చర్చ జరిగింది. వారిద్దరి వివాహ జీవితం ఎలా ఉంటుందో తేల్చేస్తానని వేణుస్వామి ప్రకటన చేయడం సంచలనం రేపుతోంది. గతంలో నాగచైతన్య, సమంత ఇద్దరూ విడిపోతారని మొట్టమొదటగా చెప్పి వేణు స్వామి సంచలనం రేపారు. ఇప్పుడు మళ్లీ నాగచైతన్య వివాహ జీవితంపై వేణు స్వామి చెబుతుండడంతో ఆయన ఏం చెబుతారోనని నెటిజన్లు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


వేణు స్వామి యూటర్న్‌
వీఐపీల జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణు స్వామి చెప్పిన చాలా విషయాలు వాస్తవమయ్యాయి. కొన్నింటిలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై చెప్పిన జ్యోతిష్యం ప్రతికూలంగా వచ్చింది. జగన్ అధికారంలోకి వస్తారని చెప్పిన వేణుస్వామి జాతకం తప్పు అయింది. జూన్ 4వ తేదీన వెలువడిన ఫలితాల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వేణుస్వామి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పారు.  ఈ సందర్భంగా రాజకీయ నేతలు, సినిమా ప్రముఖు, క్రికెట్ ఆటగాళ్ల వ్యక్తిగత జాతకాలు బహిరంగంగా చెప్పబోనని వేణుస్వామి ప్రకటించారు. అలా చెప్పి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే వేణుస్వామి యూటర్న్‌ తీసుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య, శోభిత జాతకం చెబుతానని ప్రకటించడం సంచలనం రేపుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter