Naga Chaitanya Sobhita Dhulipala Engagement: నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్..!!

Naga Chaitanya Sobhita Dhulipala Engagement: అక్కినేని వారి ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మూగనున్నాయి. తాజాగా నవయువ సామ్రాట్ నాగచైతన్య అలాగే ప్రముఖ నటి మోడల్ శోభిత ధూళిపాల ఇరువురు పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నాగచైతన్య శోభిత ధూళిపాల  రిలేషన్షిప్ లో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి.  అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతోంది.

Written by - Bhoomi | Last Updated : Aug 8, 2024, 01:01 PM IST
Naga Chaitanya Sobhita Dhulipala Engagement: నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్..!!

Naga Chaitanya and Shobhita Dhulipala engagement:  అక్కినేని వారి ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మూగనున్నాయి. తాజాగా నవయువ సామ్రాట్ నాగచైతన్య అలాగే ప్రముఖ నటి మోడల్ శోభిత ధూళిపాల ఇరువురు పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నాగచైతన్య శోభిత ధూళిపాల  రిలేషన్షిప్ లో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి.  అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతోంది. ఇందులో శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ గురువారం జరిగే అవకాశం ఉందని కొద్దిమంది అతిధుల మధ్య జరిగే ఈవెంట్ ఫోటోలు శుక్రవారం నాగర్జున స్వయంగా విడుదల చేస్తారని అలాగే పెళ్లికి సంబంధించిన వివరాలు కూడా ఆయన స్వయంగా తెలుపుతారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నాగచైతన్య నటి సమంత కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. 

Add Zee News as a Preferred Source

నటి శోభిత ధూళిపాళ్లది గుంటూరు జిల్లా తెనాలి. ఆమె 2013లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. అలాగే కింగ్ఫిషర్ క్యాలెండర్లో తలుక్కుమని మెరిసి మోడలింగ్ ప్రపంచంలో అడుగు పెట్టారు. 2016 వ సంవత్సరం బాలీవుడ్లో రోమన్ రాఘవ్ సినిమా ద్వారా ఆమె తెరంగేట్రం చేశారు. 2018లో అడవి శేషు నటించిన గూడచారి సినిమాలో శోభిత ధూళిపాల తళుక్కున మెరిశారు. అలాగే అడవి శేష్ నటించిన మరో చిత్రం మేజర్ లో సైతం శోభిత కనిపించారు. దీంతోపాటు ఆమె పలు వెబ్ సిరీస్ లలో ఒక సైతం నటించారు. ఆమె నటించిన మేడిన్ హెవెన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమైంది.

 

 

 

Also Read: Cibil Score: మీ సిబిల్ స్కోరు 400 ఉన్నా పర్లేదు..ఇలా అప్లై చేస్తే నిమిషాల్లో రూ. 10 లక్షలైనా బ్యాంక్ లోన్ పక్కా..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News