Ramnagar Bunny Movie Teaser: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా  శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రామ్ నగర్ బన్నీ. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించగా.. మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. అక్టోబర్ 4న ఈ సినిమాను గ్రాండ్‌గా ఆడియన్స్‌ ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగాహీరో చంద్రహాస్ మాట్లాడుతూ - రామ్ నగర్ బన్నీ సినిమా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్‌గా నిలుస్తుందన్నారు. రామ్ చరణ్‌, ఎన్టీఆర్, అ‌ల్లు అర్జున్ ఇలా హీరోలంతా తనకు ఇష్టమేనని.. వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని నటిస్తానన్నారు. రామ్ నగర్ బన్నీ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని.. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్‌ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే


ప్రభాకర్ మాట్లాడుతూ.. తనను బుల్లితెరపై సోదరీమణులు ఎంతో ఆదరించారని.. కుటుంబ ప్రేక్షకులు చూడటంతోనే తన సీరియల్స్ సక్సెస్ అయ్యాయని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నామని.. సకుటుంబంగా ప్రేక్షకులు చూసేలా ఉంటుందన్నారు. చంద్రహాస్‌పై ట్రోల్స్ వచ్చినప్పుడు తాము బాధ పడ్డామని.. అయితే ఈ ట్రోల్స్‌ను చంద్రహాస్ పాజిటివ్‌గా తీసుకున్నాడని చెప్పారు. తాను ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుతోనే ఈ సినిమా నిర్మించానని.. చంద్రహాస్‌లో ప్యాషన్ చూసి నిర్మాణానికి ముందుకువచ్చానని అన్నారు. ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరు ఆదరించాలని.. తన కొడుకు గొప్పస్థాయికి వెళతాడని నమ్మకం ఉందన్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఎక్కడా వల్గారిటీ లేకుండా రూపొందించామని.. అక్టోబర్ 4న థియేటర్స్‌కు వెళ్లి చూడాలని కోరారు. 


డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ.. తనకు ప్రభాకర్ మంచి మిత్రుడని.. కథ నచ్చడంతోనే వాళ్ల అబ్బాయితో నిర్మించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ఈ సినిమా కోసం చంద్రహాస్ తన కంటే ఎక్కువ కష్టపడ్డాడని.. చాలా ఎనర్జీ ఉన్న హీరో అని అన్నారు. అతను చాలా పెద్దస్థాయికి వెళతాడని చెప్పారు. తాను అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువైనా పెద్ద బడ్జెట్‌తో ప్రభాకర్ నిర్మించారని.. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకోవాలని ఆయన చెప్పారని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందన్నారు.


హీరోయిన్స్ మాట్లాడుతూ.. చంద్రహాస్‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉందని అన్నారు. రామ్ నగర్ బన్నీ మూవీ అందరినీ మెప్పిస్తుందని.. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటుందన్నారు. లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అవుతుందన్నారు. థియేటర్స్‌లో తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నామన్నారు.


Also Read: Bank holidays in October: వామ్మో..అక్టోబర్‎లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ?  జాబితా ఇదే   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.