Avatar 2 and Narappa Similarities: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులందరూ ఎంతో ఎదురుచూసిన అవతార్ 2 సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటుంది. కొందరు ఈ సినిమా చూసి అద్భుతం విజువల్ వండర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే మరి కొందరు మాత్రం ఇందులో అసలు కొత్త ఏముంది? రొటీన్ సినిమా అనిపించిందంటూ కామెంట్లు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం అవతార్ 2 సినిమా అద్భుతంగా ఉందని అందరూ ఒప్పుకుని తీరుతున్నారు. అయితే సినిమా కథ విషయంలో అనేక విమర్శలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వాస్తవానికి జేమ్స్ కామెరూన్ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు. ఆయన కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదేమో అని ఇండియన్ ఆడియన్స్ అయితే భావిస్తున్నారు.


దానికి ముఖ్య కారణం ఈ సినిమా కథ అనేక భారతీయ సినిమాల్లో మనం చూసిన కథ కావటం. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు అయితే ఈ సినిమాలో నారప్ప చాయలు కనిపిస్తుంటే తమిళ ప్రేక్షకులకు అసురన్ ఛాయలు కనిపిస్తున్నాయి. అసురన్ తమిళ సినిమా కాగా దాన్నే తెలుగులో నారప్పగా తెరకెక్కించారు. ఈ అసురన్ సినిమాలో మెయిన్ పాయింట్ ఏమిటంటే ఒకప్పుడు రెబల్ గా ఉండే తండ్రి తన పిల్లలు పుట్టిన తర్వాత వారిని కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశంగా వారే ప్రాణంగా బతుకుతూ ఉంటాడు.


అందుకోసం తగ్గడానికి అవసరమైతే తన కుటుంబం మీద అటాక్ చేస్తున్న వారిని చంపడానికి ఏమాత్రం వెనుకాడడు. ఇదే మెయిన్ పాయింట్ గా తీసుకుని అవతార్ 2 సినిమాని కూడా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. జేమ్స్ కామెరూన్ లాంటి దర్శకుడు మన తెలుగు లేదా తమిళ సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అని చెప్పలేం గానీ పాయింట్ దాదాపుగా ఒకటే ఉండటంతో ఇదే రకమైన విమర్శలు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.  
 
ఈ పోలికల వలనే
అయితే ఈ సినిమాల మంచి కథలో చాలా సారూప్యతలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సారూప్యతల విషయానికి వస్తే అవతార్ సినిమాలో హీరోది వేరే గ్రహం అయితే మరో గ్రహానికి చెందిన హీరోయిన్ ని పెళ్ళాడతాడు. ఇక మన సినిమాల విషయానికి వస్తే హీరో వేరే గ్రామం నుంచి వచ్చి హీరోయిన్ గ్రామంలో స్థిరపడి అదే హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. ఇక ఈ సినిమాలలో హీరోకి ఇద్దరు కుమారులు ఉంటారు.


పెద్ద కుమారుడు మరణిస్తే రెండో కుమారుడిని ఎలా అయినా కాపాడుకోవాలని హీరో దేనికైనా తెగిస్తాడు. అలాగే తన కుమారులను కాపాడు కోసం ఉన్నచోటు వదిలేసి వేరే చోటుకు వెళ్లేందుకు ప్రయత్నించడం చివరికి తమ ముందు ఆపద వచ్చిందని తెలుసుకుని సింహంలా ఆపదను ఎదిరించి నిలబడటం ఇదంతా చూస్తుంటే అవతార్ సినిమాకి మన అసురన్, నారప్ప సినిమాలకి అనేక పోలికలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏమిటో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి.


Also Read: Hunger Strike: టాలీవుడ్ నిర్మాతల నిరాహార దీక్ష.. అసలు ఏమైంది అంటే?


Also Read: Hyderabad Metro: ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణంపై వేగంగా అడుగులు.. ఒకే చోట రెండు మెట్రో స్టేషన్లు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.