Tollywood producers to sit on relay Hunger Strikes: ప్రస్తుతానికి తెలుగు సినీ పరిశ్రమ చరిష్మా ఒక్కసారిగా ప్రపంచ స్థాయికి చేరింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను కూడా మన సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా విదేశాల్లో సైతం మన సినిమాలు భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఉండటంతో ఇండియా వ్యాప్తంగా బాలీవుడ్ కంటే టాలీవుడ్ కి ఎక్కువ క్రేజ్ అయితే లభిస్తుంది.
అయితే ఇలా ఒకపక్క మన చరిష్మా పెరుగుతూ వెళుతుంటే తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం లుకలుకలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఏకంగా సినిమా షూటింగ్స్ నిలిపివేస్తే ఇప్పుడు నిర్మాతలు అందరూ రిలే నిరాహార దీక్షలకు కూర్చోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం వరకు సినిమా ప్రొజెక్షన్ విషయంలో ఎక్కువగా రీల్స్ ని వాడే వాళ్లు. అయితే టెక్నాలజీ విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు సినిమాలను నేరుగా శాటిలైట్ ద్వారా ప్రదర్శితం చేస్తున్నారు.
అయితే దానికి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారని నిర్మాతలు భావిస్తున్నారు. సెప్టెంబర్ ఆరో తేదీన ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించుకున్నారు. 15 రోజుల్లో ఎన్నికలు పెట్టుకోవాలని ఎన్నికల తర్వాత ఎన్నికైన కొత్త బాడీతో కలిసి ఈ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే ఇప్పటి వరకు ఆ నిమిత్తం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మొండిగా వ్యవహరిస్తోందని నిర్మాతలు భావిస్తున్నారు.
తమ పాలిట శాపంగా మారి దోపిడీకి గురి చేస్తున్న క్యూబ్, యూఎఫ్ఓ వంటి డిజిటల్ ప్రొవైడర్స్ ధరలు తగ్గించాలని నినాదంతో రేపు ఉదయం 10 గంటల నుంచి ఫిలిం ఛాంబర్ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని కొందరు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి మరి నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: మిమ్మల్ని మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతా.. విజయసాయికి బండ్ల వరుస కౌంటర్లు
Also Read: Gang Rape: 16 ఏళ్ల బాలికపై గాంగ్ రేప్,, 8 మంది కలిసి 14 గంటలపాటు దారుణంగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.