Avatar 2: 25 ఏళ్ల తరువాత 7 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా రిస్కీ షాట్‌లో నాటి హీరోయిన్
Avatar 2: 35 ఏళ్ల క్రితం ఆ సినిమా ఓ సంచలనం. టైటానిక్ సినిమాలో నటించిన నాటి హీరోయిన్ తిరిగి ఇప్పుడు అవతార్ 2లో కన్పించింది. అది కూడా అత్యంత సాహసోపేతమైన రిస్కీ షాట్‌లో..ఆ వివరాలు మీ కోసం..
1997లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టైటానిక్ సినిమా అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో తెరంగేట్రం చేసిన హాలీవుడ్ నటి కేట్ విన్స్‌లెట్ తిరిగి 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత అవతార్ 2లో అలరించింది.
ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురూచూసిన అవతార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఐడీఎంబీలో 8.2 రేటింగ్ సొంతం చేసుకున్న అవతార్ 2 ఇవాళ డిసెంబర్ 16న ప్రపంచమంతా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు. అత్యద్భుతమైన టెక్నాలజీ సహాయంతో నీటి లోపల తెలియని ప్రపంచాన్ని పరిచయం చేసి..అందులో విహరించేలా చేశాడు. అవతార్ విడుదలైన 13 ఏళ్ల తరువాత అవతార్ సీక్వెల్‌గా అవతార్ 2 తెరకెక్కింది.
అవతార్ 2 సినిమాలో రోనల్ పాత్రలో కన్పించిన నటి ఎవరో కాదు. 25 ఏళ్ల క్రితం విడుదలై ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్‌లెట్. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాలో కేట్ విన్స్‌లెట్ అందానికి అందరూ దాసోహమయ్యారు. ఇప్పటికీ ప్రేమ కధా చిత్రాల్లో టైటానిక్ సీన్ కచ్చితంగా ఉంటుందంటే..ఎంతగా ఆ పాత్ర ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ తిరిగి ఇప్పుడు అవతార్ 2లో అత్యంత సాహసోపేతమైన షాట్‌లో నటించి మరోసారి అందర్నీ మెప్పించింది.
7 నిమిషాలు నీటిలో ఊపిరి తీసుకోకుండా..
అవతార్ 2 సినిమాలో ఓ సీన్ కోసం కేట్ విన్స్‌లెట్ ఏకంగా 7 నిమిషాల 15 సెకన్లు ఊపిరి తీసుకోకుండా నటించి..పాత రికార్డును బ్రేక్ చేసింది. గతంలో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో 6 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా ఉన్నాడు. ఇప్పుడీ సినిమాలో నీటి అడుగున షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి భరించానంటోంది కేట్ విన్స్‌లెట్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook