Avatar 2 Review and Rating: ప్రేక్షకుల ముందుకు అవతార్ 2, సినిమా ఎలా ఉంది, రివ్యూ రేటింగ్ పరిస్థితి ఏంటి

Avatar 2 Review and Rating: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన అవతార్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. పూర్తి అత్యాధునిక సాంకేతికతను జోడించుకుని విడుదలైన అవతార్ 2 రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 16, 2022, 04:03 PM IST
Avatar 2 Review and Rating: ప్రేక్షకుల ముందుకు అవతార్ 2, సినిమా ఎలా ఉంది, రివ్యూ రేటింగ్ పరిస్థితి ఏంటి

అవతార్. గ్రాఫిక్స్ మాయాజాలంతో జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఓ అద్బుతం. ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ మూటగట్టుకుని, కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా. అలాంటి సినిమాకు సీక్వెల్ కావడంతో అవతార్ 2పై అంచనాలు పెద్దఎత్తున ఉన్నాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది.

అవతార్ 2 సినిమా..అవతార్ మొదటిభాగం కంటే గొప్పగా, పెద్దదిగా, ఎమోషనల్‌గా ఉంది. కేట్ విన్స్‌లెట్, విన్ డిజీల్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలో లీనమై..ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిల్చారు. ఇక దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరోసారి సత్తా చూపించారని చెప్పాలి. నీళ్లలో మనకు తెలియని ప్రపంచలో తీసుకెళ్లి ఆనందపరుస్తారు. 

ఈ సినిమాలో అత్యాధునిక టెక్నాలజీ, అద్భుతమైన దృశ్యాలు కథ, కథనం, మేకింగ్ వాల్యూస్ ప్లస్ పాయింట్స్ కాగా సినిమా రన్‌టైమ్ పెద్ద మైనస్ పాయింట్. అవతార్ మొదటి భాగం చూడకపోతే..సినిమా అర్ధం కాకపోవడం మరో మైనస్. 

కొంతమందైతే సినిమా ఊహించుకున్నంతగా లేదని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో రివ్యూలు దారుణంగా ఇస్తున్నారు. మొదటి భాగంలో ఉన్నంత లేదంటున్నారు. ట్రైలర్‌కు, సినిమాకు సంబంధం లేదంటున్నారు. 

అటు దర్శకుడు ఆర్జీవీ కూడా ఈ సినిమాపై ట్వీట్ చేశారు. అవతార్ 2 లో స్నానం చేశానని..దీనిని సినిమా అంటే నేరమౌతుందన్నారు. సినిమాలో విజ్యువల్స్, యాక్షన్ జీవితాంతం గుర్తుండిపోతాయని ప్రశంసలు కురిపించారు. మొత్తానికి అవతార్ 2 సినిమాకు 5కు 3 లేదా 3.5 వరకూ రేటింగ్ వస్తోంది. ఇక కధ, స్క్రీన్‌ప్లేకు కేవలం 2.5 రేటింగ్ మాత్రమే లభిస్తుంటే..నటీనటుల నటనకు 3 రేటింగ్ ఇస్తున్నారు. సాంకేతికతకు మాత్రం 4 రేటింగ్ ఇచ్చేస్తున్నారు.

మరోవైపు ఐఎండీబీ మాత్రం అవతార్ 2 సినిమాకు 10కు 8.2 రేటింగ్ ఇస్తోంది. 8.2/10  రేటింగ్ అంటే సినిమా సక్సెస్ అనే అర్ధం.

Also read: Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి.. కొత్త జీవితం అంటూ కడపలో ఆసక్తికర కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News