అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో సరికొత్త ప్రపంచాన్ని చూపించిన సినిమాలు అవతార్ 1, 2లు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన అవతార్‌లానే అవతార్ 2 కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవతార్ మొదటి భాగమే ఓ సంచలనమైతే..అవతార్ 2 ది వే ఆప్ వాటర్ అంతకంటే అద్భుతంగా నిలిచింది. ఇటీవల  ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీగా కలెక్షన్లు చేస్తోంది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన పండోరా ప్రపంచమంతటినీ ఆకర్షించింది. అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలై భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. 


అవతార్ 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని 21 సెంచరీ ఫాక్స్ మీడియా కంపెనీ సొంతం చేసుకుంది.ఈ కంపెనీని 2017లో వాల్ట్ డిస్నీ సంస్థ 52.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అందుకే అవతార్ 2 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ దాదాపు ఖరారైందని తెలుస్తోంది. అవతార్ విషయంలో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ధియేటర్ రిలీజ్ అయిన 200 రోజుల తరువాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే 2023 ఏప్రిల్ నెలలో అవతార్ 2 స్ట్రీమింగ్ కానుందని అంచనా.


Also read: RRR 2 Updates: అభిమానులకు గుడ్‌‌‌న్యూస్, ఆర్ఆర్ఆర్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook