Brahmastra Movie Updates: బాలీవుడ్ కొత్త జంట రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ నటించిన పాన్‌ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర'. ఈ చిత్రంలో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌ కీలకపాత్రలు పోషించారు. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు పార్ట్ 2, 3 ఉంటాయని డైరెక్టర్ అయాన్ ఇప్పటికే చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ వాటి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. రెండో భాగంలో హృతిక్ రోషన్ నటిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై హృతిక్ ను ప్రశ్నించగా... ‘''ఇప్పుడైతే ఆ ప్రాజెక్ట్‌ నా దగ్గరకు రాలేదు. అయితే ఏదైనా జరగొచ్చు. అవకాశం వస్తుందనే ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా దర్శకుడు అయాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ''వాస్తవానికి మేము రిలీజ్ డేట్స్ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. పార్ట్‌1 విడుదల అయిన 3 సంవత్సరాలకు పార్ట్‌2... అలాగే పార్ట్‌2 రిలీజ్ చేసిన సంవత్సరానికి పార్ట్‌3 విడుదల చేయాలని అనుకున్నాం. అంటే 2025 దిపావళికి బ్రహ్మాస్త్ర రెండో భాగాన్ని, 2026 క్రిస్‌మస్‌కు మూడో భాగాన్ని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఈ డేట్స్ లోనే కచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పట్లేదు. పరిస్థితుల్ని బట్టి మారవచ్చు. మేము బ్రహ్మాస్త్రకు 6 విడుదల తేదీలు ప్రకటించామనుకుంటా''..అని చెప్పాడు.


Also read: Movies Releasing this week: పొన్నియన్ సెల్వన్ సహా థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు ఇదే! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook